స్లిమ్, స్టైల్ దీని సొంతం!!

Posted By: Prashanth

స్లిమ్, స్టైల్ దీని సొంతం!!

 

టాబ్లెట్ కంప్యూటర్ల ప్రపంచంలోకి ఓ కొత్త స్నేహితుడు వచ్చి పడ్డాడు.. అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తానంటూ తెగ ఉత్సాహపడుతున్నాడు.. ఇంతకి ఎవరా ఫ్రెండ్..?, ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు ‘హువావీ’(Huawei) తమ మొట్ట మొదటి టాబ్లెట్ కంప్యూటర్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. ‘హువావీ ఐడియోస్ ఎస్ 7’ వేరియంట్ లో డిజైన్ కాబడిన ఈ స్టన్నింగ్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ పనితీరును పరిశీలిద్దామా..?

GSM/ 3G ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ వ్యవస్థ పై టాబ్లెట్ రన్ అవుతుంది. పీసీ పనితీరు వేగవంతంగా ఉండేవిధంగా 768 MHz ప్రాసెసింగ్ వ్యవస్థను డివైజులో నిక్షిప్తం చేశారు. గ్యాడ్జెట్లో అమర్చిన ర్యామ్ సామర్ధ్యం 256 MB. టచ్ ఆధారితంగా ఈ బుల్లి కంప్యూటర్ పని చేస్తుంది. జీఎస్ఎమ్ నెటవర్కింగ్ సపోర్ట్ అదే విధంగా 3జీ ఇంటర్నెట్ సౌలభ్యత. టాబ్లెట్ ఇంటర్నల్ మెమరీ 5 జీబి. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ సౌలభ్యతతతో మెమరీ సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు.

ఏర్పాటు చేసిన డ్యూయల్ కెమెరా వ్యవస్థ నాణ్యమైన చిత్రాలను బంధించుకునేందుకు దోహదపడుతంది. అదే విధంగా ఆత్మీయులతో వీడియో ఛాటింగ్ నిర్విహించుకోవచ్చు. అనుసంధానం చేసిన జీపీఎస్, వై-ఫై, ఎడ్జ్, జీపీఆర్ఎస్, మైక్రో యూఎస్బో పోర్ట్ వ్యవస్థలు పీసీ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని మరింత పెంచుతాయి. నిక్షిప్తం చేసిన బ్యాటరీ పటిష్టతతో కూడిన బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుది. నలుపు, తెలుపు మిక్స్ అయిన ఆకర్షణీయమైన డిజైన్ లో ‘ఐడియోస్ ఎస్ 7’ రూపు దిద్దుకుంది ధర రూ.20,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot