విండోస్ 10తో హువాయి మాట్ బుక్ D లాంచ్!

By Madhavi Lagishetty
|

ప్రముఖ ఐటిసి కంపెనీ అయిన హువాయి ఈ ఏడాది మూడు లాప్ టాప్లను రిలీజ్ చేసింది. మాట్ బుక్ D, E, X లాప్ టాప్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇఫ్పుడు మాట్ బుక్ D కి రిఫ్రెష్ ఎడిషన్ను కంపెనీ ప్రకటించింది. మాట్ బుక్ అప్ గ్రేడ్ చేయబడిన CPU మరియు గ్రాఫిక్స్ తో వస్తుంది. అయితే డిజైన్ మాత్రం 2017 వెరియంట్ను పోలి ఉంటుంది.

 
విండోస్ 10తో  హువాయి మాట్ బుక్ D లాంచ్!

2018లో రిలీజ్ కానున్న ల్యాప్ టాప్ డిజైన్లో ఎలాంటి మార్పులు లేవు. మాట్ బుక్ Dనే డబ్ చేశారు. కానీ కొంచెం అప్ గ్రేడ్ అయ్యింది. CPU మరియు గ్రాఫిక్స్ కార్డును అదనంగా చేర్చారు. హువాయి మాట్ బుక్ D బాడీ మొత్తం మెటల్ తో డిజైన్ చేశారు. ఇది కేవలం 16.9ఎం,ఎం ఉంటుంది. 15.6అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. మునుపటి మోడల్ మాదిరిగానే 83శాతం స్రీన్ టు బాడీ రేషియోను కలిగి ఉంటుంది.

ఇక ఈ ల్యాప్ టాప్ 1920 × 1080 పిక్సెల్స్ తో ఫుల్ హెచ్డి రిజల్యూషన్ను అందిస్తుంది. ల్యాప్ టాప్ మానీటర్ను చూసేందుకు 178డిగ్రీల యాంగిల్లో ఉంటుంది. 45శాతం కవరేజ్ తో NTSC కలర్ బ్రైట్ నెస్ ఉంటుంది.

ఇన్నార్డ్స్ కోసం హువాయి మాట్ బుక్ D (2018) 8జిబి ర్యామ్ తో కలిపి ఇంటెల్ యొక్క 8వ జనరేషన్ కోర్ I5-825OUప్రొసెసర్ తో క్లబ్ చేయబడి ఉంటుంది. కోర్ ఐ 5 ప్రొసెసర్ తో బేస్ మోడల్ రెండు రకాల్లో లభిస్తుంది. 256జిబి SSD స్టోరేజితోపాటు మరో ఫీచర్ 128GB SSD+1TB HDDస్టోరేజితో వస్తుంది.

హైయ్యర్ ఎండ్ మోడల్ మాట్ బుక్ D (2018) 8జిబి ర్యామ్ మరియు 128జిబి SSD+1TB HDDస్టోరేజితో ఇంటెల్ కోర్ i7-855OU CPU చే పవర్ను సప్లై చేస్తుంది.

తక్కువ ధరతో Samsung Galaxy J2 ( 2018 )వచ్చేస్తోంది !తక్కువ ధరతో Samsung Galaxy J2 ( 2018 )వచ్చేస్తోంది !

ఇక గ్రాఫిక్స్ ప్రొసెసర్ గురించి చూసినట్లయితే..కొత్త ల్యాప్ టాప్ ప్యాకస్ Nvidia MX150.Huawai Matabook D(2018) 43.3Whబ్యాటరీని కలిగి ఉంది. ఇది దాదాపు 10గంటల వరకు రన్ అవుతుంది. అంతేకాదు 8.5గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. డివైస్ బిల్ట్ ఇన్ డాల్బి స్పీకర్ సిస్టమ్ తోపాటు రెండు USB 3.0పోర్ట్లు ఒక USB 2.0పోర్ట్ మరియు ఒక HDMIపోర్టు కలిగి ఉంది. వై-ఫై కోసం డ్యుయల్ యాంటెన్నా డిజైన్ను ఉపయోగిస్తుంది. నెట్ వర్క్ కవరేజ్ మరియు సిగ్నల్ రేంజ్ ను విస్తరిస్తుంది.

ఇక ల్యాప్ టాప్ మూడు మోడల్స్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతాయి. 256జిబి, SSDతో కోర్ ఐ5 మోడల్ ధర 50,700రూపాయలు, 128జిబి SSD+1TB HDD ధర 53,640రూపాయలు. కోర్ ఐ7 ప్రొసెసర్ను కలిగి ఉన్న హై ఎండ్ మెడల్ 65,400రూపాయల ట్యాగ్ను కలిగి ఉంది.

 

ఈ ల్యాప్ టాప్స్ అంతర్జాతీయంగా లభిస్తున్నాయా లేదా అనే సమచారం లేదు.

Best Mobiles in India

Read more about:
English summary
The high-end model of the Huawei MateBook D (2018) features Intel Core i7-8550U CPU along with 8GB RAM.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X