చైనా బ్రాండ్ నుంచి రెండు శక్తివంతమైన టాబ్లెట్‌లు!

Posted By: Super

చైనా బ్రాండ్ నుంచి రెండు శక్తివంతమైన టాబ్లెట్‌లు!

 

చైనా ఆధారిత టెక్నాలజీ సంస్థ హువావీ తన సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్‌లను మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించింది. ‘మీడియా ప్యాడ్ 7 లైట్’, ‘మీడియా ప్యాడ్ 10 ఎఫ్‌హెచ్‌డి’ శ్రేణుల్లో ఈ బ్రాండ్ డిజైన్ చేసిన టాబ్లెట్‌‌లలో మొదటిదైన మీడియా ప్యాడ్ 7లైట్ నేటి నుంచి మార్కెట్లో రూ.13,700 ధరకు లభ్యం కానుంది. మరో టాబ్లెట్ మీడియా ప్యాడ్ 10 ఎఫ్‌హెచ్‌డి డిసెంబర్ తొలివారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో , హువావీ డివైజ్ ఇండియా అధ్యక్షుడు విక్టర్ షాన్‌క్సిన్ అలాగే హువావీ డివైజ్ ఇండియా అమ్మకాల సంచాలకులు పీ. సంజీవ్ పాల్గొన్నారు.

మీడియా ప్యాడ్ 7 లైట్:

బరువు 370 గ్రాములు, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, కార్టెక్స్ ఏ8 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 600మెగాహెడ్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 7 అంగుళాల ఐపీఎస్ మల్టీటచ్ స్ర్కీన్,రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్, 1080పిక్సల్ హైడెఫినిషన్, 3జీ సెల్యూలర్ సర్వీస్, మల్టీ మీడియా ఫీచర్లు, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ కాలింగ్, 4100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఫ్లిప్‌కార్ట్  వంటి మల్లీ బ్రాండ్ అవుట్‌లెట్‌లు ఆఫర్ చేస్తున్నాయి.

మీడియా ప్యాడ్ ఎఫ్‌హెచ్‌డి:

ఆఫీస్, వెబ్ బ్రౌజింగ్ అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను తీర్చటంలో ఈ డివైజ్ సమృద్ధిగా తోడ్పడుతుంది. 10 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1920 x 1200పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-పై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 3.0, 5.1 డాల్బీ సరౌండ్ టెక్నాలజీ, కీబోర్డ్ యాడ్-ఆన్, వీజీఏ ఇంకా హెచ్‌డిఎమ్ఐ అవుట్,  6,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 16జీబి, 32జీబి ఇంకా 64జీబి మెమరీ వర్షన్‌లలో ఈ టాబ్లెట్ లభ్యం కానుంది. ధర రూ.30,000.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot