హువావీ నుంచి ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ టాబ్లెట్.... ఈ నవంబర్‌లో!

Posted By: Staff

 హువావీ నుంచి ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ టాబ్లెట్.... ఈ నవంబర్‌లో!

 

ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువావీ, నవంబర్ మొదటి వారంలో ‘మీడియా ప్యాడ్ 7 లైట్’ పేరుతో ఓ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను విడుదల చేయనుంది. తొలత ఈ టాబ్లెట్‌ను జూలైలో ఆవిష్కరించారు. ధర రూ.14,000.

ఫీచర్లు: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల ఐపీఎస్ మల్టీటచ్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 3.2 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు), 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, మొబైల్ 3జీ సిమ్ స్లాట్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 4100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

దేశీయ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ నెలకున్న నేపధ్యంలో హువావీ ‘వై’ సిరీస్ నుంచి రూ.10,000 ధర శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను రానున్న నెలల్లో విడుదల చేస్తామని హువావీ ఇండియా అధ్యక్షుడు (పరికరాల విభాగం) విక్టర్ షాన్ వెల్లడించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot