హవాయి మీడియాప్యాడ్ 7 యూత్ 2 టాబ్లెట్
చైనాకు చెందిన ప్రముఖ ట్యాబ్లెట్ కంప్యూటర్ల తయారీ కంపెనీ హవాయి మీడియాప్యాడ్ 7 యూత్2 ( Mediapad 7 Youth2) పేరుతో సరికొత్త ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.10,999. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ లైన అమెజాన్, ఇన్ఫీబీమ్, ఫ్లిప్‌కార్ట్‌లు ఈ స్మార్ట్ కంప్యూటింగ్ టాబ్లెట్‌ను విక్రయిస్తున్నాయి. డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

వాయిస్ కాలింగ్ సామర్థ్యం,
7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1024x 600పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం,
హవాయి ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








