మీరు మెచ్చే ధరకే టాబ్లెట్ కంప్యూటర్!!

Posted By: Super

మీరు మెచ్చే ధరకే టాబ్లెట్ కంప్యూటర్!!

 

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ సంస్థ ‘హువావీ’ డిజిటల్ ప్రపంచం మెచ్చుకోదగ్గ మన్నికైన టాబ్లెట్ పీసీని వ్ళద్థి చేసింది. ‘మీడియా ప్యాడ్’ నమూనాలో రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ సరసమైన ధరకే లభ్యంకానుంది. డివైజ్ ఫీచర్లను పరిశీలిస్తే 7 అంగుళాల వెడల్పాటి టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే సుసంపన్నమైన 26వేల రంగులతో ‘ఐపీఎస్ ఎల్‌సీడీ’ వ్యవస్థను ఒదిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది.

యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఆండ్రాయిడ్ నూతన వర్షన్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థ పై టాబ్లెట్ రన్ అవుతుంది. దోహదం చేసిన 1.2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్ సమర్ధవంతమైన పనితీరును కలిగి ఉంటుంది. నిక్షిప్తం చేసిన హై పవర్ బ్యాటరీ వ్యవస్థ మన్నికైన బ్యాకప్ నిస్తుంది. పీసీలోని మరికొన్ని ముఖ్య విశేషాలు:

* హై స్పీడ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్,

* ఆటోఫోకస్,

* జియో ట్యాగింగ్,

* వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు ఫ్రంట్ కెమెరా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot