రసవత్తరం కానున్న సెగ్మెంట్?

మారుతున్న సమీకరణలతో టాబ్లెట్ కంప్యూటర్ల విభాగం రోజు రోజకు హీటెక్కుతోంది... మార్కెట్లోకి అడుగుపెట్టిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. గుగూల్ ఆధారిత ఈ వోఎస్‌ను పలు ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే అప్‌డేట్ చేసుకున్నాయి. ఈ కోవకే చెందిన మరో బ్రాండ్ హువావీ తన ‘మీడియా ప్యాడ్’టాబ్లెట్ పీసీకి ఐసీఎస్ 4.0.3 అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ తాజా నవీకరణతో మీడియా ప్యాడ్ మరిన్ని ఆడ్వాన్సుడ్ ఫీచర్లతో సుసంపన్నం కానుంది.
ఆండ్రాయిడ్ 3.0 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతునన్న ఈ పీసీని ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంకు నవీకరించటం శుభపరిణామమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మీడియా ప్యాడ్ యూజర్లు నేరుగా కంపెనీ
వెబ్‌సైట్‌లోకి లాగినై ఈ వోఎస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ తాజా వృద్థితో టాబ్లెట్, కెమెరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. అంతేకాకుండా, యూజర్ పీసీని మరింత సులువగా ఆపరేట్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. డివైజ్ పనితీరుపై నెలకున్న సందేహాలన్ని ఈ అప్‌డేట్‌తో పటాపంచలు కానున్నాయి.
హువావీ మీడియా ప్యాడ్ ఫీచర్లు:
7 అంగుళాల టచ్ స్ర్కీన్,
ఐపీఎస్ ఎల్‌సీడీ,
5 మెగా పిక్సల్ కెమెరా,
ఫ్రంట్ కెమెరా,
1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
హై స్పీడ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్.


Click it and Unblock the Notifications








