‘హవాయ్’ ఇప్పుడు 25,000కే..!!

Posted By: Super

‘హవాయ్’ ఇప్పుడు 25,000కే..!!


‘‘వినూత్న సాంకేతిక పరికరాల తయారీతో నిత్యం వార్తల్లోనిలిచే ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీదారు ‘హవాయ్’ ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘మీడియా ప్యాడ్’ను కేవలం రూ. 25,000కే అందించనుంది. కేవలం 380 గ్రాముల బరువుతో రూపుదిద్దుకున్న మీడియా ప్యాడ్ అత్యుత్తమ స్టైలిష్ ఫీచర్లతో పాటు సమర్ధవంతమైన పనితీరును వినియోగదారుడికి అందిస్తుంది.’’

క్లుప్తంగా ఫీచర్లు:

- ఆండ్రాయిడ్ వర్షన్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకున్న ఈ ‘మీడియా ప్యాడ్’ మన్నికైన పని వ్యవస్థను కలిగి ఉంటుంది.
- ఏర్పాటు చేసిన 1.2 GHz శక్తివంతమైన ప్రొసెసర్ సమర్ధవంతమైన పని తీరును సమీక్షిస్తుంది.
- నాణ్యమైన 1.3 మోగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా అంతరాయంలేని వీడియో ఛాటింగ్ కు ఉపకరిస్తుంది.
- ప్యాడ్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా నాణ్యమైన చిత్రాలను హై డెఫినిషన్ నాణ్యతతో పదిలపరుస్తుంది.
- పొందుపరిచిన హై స్పీడ్ ‘వై - ఫై’ 802.11 b/g/n వ్యవస్థ 14.4 Mbps వేగంతో సమాచార వ్యవస్థను మరింత వేగవంతం చేస్తుంది.
- వివిధ వెబ్ ఆధారిత ఇంటర్నెట్ ఆప్లికేషన్లను మీడియా ప్యాడ్‌లో ముందుగానే లోడ్ చేశారు.
- అక్టోబర్‌లో విడుదల కాబోతున్న ఈ ‘మీడియా ప్యాడ్’ మార్కెట్ వర్గాల్లో అంచనాలు పెంచుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot