‘ఆరు’ నెలల్లోనే ప్రమోషన్...?

Posted By: Prashanth

‘ఆరు’ నెలల్లోనే ప్రమోషన్...?

 

జూన్ 2011లో విడుదలైన ‘హువావీ మీడియా ప్యాడ్’ టాబ్లెటీ పీసీకి ప్రమోషన్ లభించింది. ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1.2 GHz ప్రాసెసర్‌ వంటి బలమైన ఫీచర్లతో విడుదలైన ఈ కంప్యూటింగ్ డివైజ్ అప్పట్లో సంచలనాన్ని మూటగట్టుకుంది. టెక్నాలజీ మరింత వృద్థి చెందిన నేపధ్యంలో గ్యాడ్జెట్ పని వేగాన్ని పెంచుతూ ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం స్థానంలో ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంను అప్‌గ్రేడ్ చేశారు. ఈ టాబ్లెట్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే..

7 అంగుళాల గ్లేర్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే పటిష్టమైన రిసల్యూషన్‌తో హై క్వాలిటీ విజువల్స్‌ను విడుదల చేస్తుంది. టాబ్లెట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా మన్నికైన క్లారిటీతో వీడియోను రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా 1.3 మెగా పిక్సల్. పొందుపరిచిన వై-ఫై వ్యవస్థ డివైజ్ ఇంటర్నెట్ వేగాన్ని మరింత పుంజుకునేలా చేస్తుంది. HSDPA నెట్‌వర్క్ డౌన్‌లోడ్ వేగం 14.4 Mbps. నిక్షిప్తం చేసిన ఇంటిగ్రేటెడ్ బ్లూటూత్ వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫరింగ్‌కు దోహదపడుతుంది.

పిసీకి ఈ తాజా అప్‌డేట్ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇన్‌బుల్ట్ చేసిన మరిన్న అప్లికేషన్‌లు వినియోగదారుడి కంప్యూటింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తాయి. అప్‌డేటెడ్ హువావీ మీడియా ప్యాడ్ ఇండియన్ మార్కెట్ ధర రూ.29,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot