డిసెంబర్‌లో మేమేంటో చూపిస్తాం!

Posted By: Prashanth

డిసెంబర్‌లో మేమేంటో చూపిస్తాం!

 

ప్రముఖ గ్యాడ్జెట్‌ల నిర్మాణ సంస్థ హువావీ (Huawei) భారత్‌లో ఎల్‌టీఈ నెట్‌వర్క్ ఆధారిత పరికరాలను ప్రవేశపెట్టనుంది. ప్రణాళికలో భాగంగా డిసెంబర్ నాటికి ఎల్‌టీఈ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీని అందుబాటులోకి తెచ్చేందుకు బ్రాండ్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి దేశంలో పూర్తిస్థాయి 4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేదు. కోల్‌కతా, బెంగుళూరు వంటి పట్టణాల్లో ‘టీడీ ఎల్‌టీఈ’(TD LTE) నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ నెట్‌వర్క్ పూణే, ఢిల్లీ, ముంబయ్, చండీగఢ్ వంటి ప్రాంతాలకు విస్తరించనుంది. గ్యాడ్జెట్‌లను విడుదల చేసే అంశాన్ని హువావీ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు ధృవీకరించారు.

హువావీ ప్రవేశపెట్టబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు:

ఎసెండ్ డి ఎల్ టీఈ (ధర తెలియాల్సి ఉంది),

ఎసెండ్ పీ1 ఎల్ టీఈ (ధర తెలియాల్సి ఉంది)

హువావీ ప్రవేశపెట్టబోతున్న టాబ్లెట్ పీసీ:

మీడియా ప్యాడ్ 10 ఎల్‌టీఈ (ధర తెలియాల్సి ఉంది)

హువావీ(Huawei), మీడియా ప్యాడ్ 10ఎఫ్‌హెచ్‌డి టాబ్లెట్ ఫీచర్లు క్లుప్తంగా:

10 అంగుళాల 10-పాయింట్ మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1920× 1200పిక్సల్స్), ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ చిప్‌సెట్, 1.5గిగాహెట్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన కె3 వీ2 ప్రాసెసర్, 8మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి డీడీఆర్3 ర్యామ్, మైక్రోఎస్‌డి స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్ 2.1, 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. టాబ్లెట్‌ను తొలిగా చైనా మార్కెట్లో విడుదల చేస్తారు. భారత విపణిలో ఈ డివైజ్‌ను ఆగష్టులో విడుదల చేసే అవకాశముంది. ధర అంచనా రూ.25,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot