సోనీ టాబ్లెట్ పై 9,000లు తగ్గింపు!!

Posted By: Prashanth

సోనీ టాబ్లెట్ పై 9,000లు తగ్గింపు!!

సోనీ అభిమానులారా.. త్వరపడండి ఇటువంటి మంచి తరుణం మించినా రాదు. ఉత్తమమైన కంప్యూటింగ్ విలువలతో కూడిన సోనీ వై-ఫై టాబ్లెట్ పీసీని 9,000 తగ్గింపు తో సొంతం చేసుకోండి. ఈ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది ఎవరో కాదు దేశ అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్‌సైట్ అయిన ‘గ్యాడ్జెట్స్ గురు.కామ్’.16జీబి స్టోరేజ్ సామర్ధ్యం కలిగిన ఈ వై-ఫై టాబ్లెట్ ఇండియాలో విడుదలైనాటి ధర రూ.22889. అంటే ఈ పీసీని రూ. 13889కి సొంత చేసుకోవచ్చన్న మాట. ఆధునాతన కంప్యూటింగ్ ఫీచర్లను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. వాటి వివరాలు క్లుప్తంగా....

* వెడల్పాటి టీఎఫ్టీ కలర్ ఎల్‌సీడి టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

* తక్కువ బరువు (స్లిమ్ డిజైనింగ్),

* ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్థ,

* అత్యాధునిక ఆడియో మరియు వీడియో ప్లేయర్,

* 8 గంటల సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ సిస్టం,

* 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

* ఎన్-విడియా టెగ్రా2 మొబైల్ ప్రాసెసర్‌తో పాటు డ్యూయల్ కోర్ కార్టెక్స్ - ఏ9 1జిగాహెడ్జ్ ప్రాసెసర్,

* స్టీరియో స్పీకర్ వ్యవస్థ,

* వైర్లెస్ కనెక్టువిటీ,

* వేగవంతంగా స్పందించే యూఎస్బీ పోర్టు.

అదనంగా పలు సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్‌లను పీసీలో ఇన్‌బుల్ట్ చేశారు. విశ్వసనీయ బ్రాండ్ సోనీ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ తక్కువ ధరకే టాబ్లెట్ కంప్యూటర్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి సరి అయిన ఛాన్స్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot