360 డిగ్రీలు తిరిగే డిస్‌ప్లేతో ఐబాల్ ల్యాప్‌టాప్

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపనీ ఐబాల్, CompBook Aer3 పేరుతో సరికొత్త ల్యాప్ టాప్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 360 డిగ్రీ రొటేటబుల్ డిస్‌ప్లేను కలిగి ఉండే ఈ ల్యాపీ ధర రూ.29,999. ల్యాపీ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

Read More : నోకియా 3లో అంత దమ్ముందా...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

CompBook Aer3 స్పెసిఫికేషన్స్..

13.3 అంగుళాల ఫుల్ హైడఫినిషన్ టచ్ స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x 1920పిక్సల్స్), విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, క్వాడ్-కోర్ ఇంటల్ పెంటియమ్ ఎన్4200 ప్రాసెసర్.

CompBook Aer3 స్పెసిఫికేషన్స్..

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, క్వాడ్-స్పీకర్స్, 37Wh లై-పాలిమర్ బ్యాటరీ, ఫుల్ సైజ్ కీబోర్డ్, యూఎస్బీ 3.0 పోర్ట్, మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, ఇంటల్ డ్యుయల్ బ్యాండ్ వైర్‌లెస్, బ్లుటూత్ వీ4.0, 2 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్.

పూర్తి మెటాలిక్ బాడీ..

పూర్తి మెటాలిక్ బాడీతో వస్తోన్న ఈ ల్యాప్‌టాప్ బరువు 1.48 కిలోగ్రాములు. చుట్టుకొలత 321x213x17 మిల్లీ మీటర్లు, RDS3TNEW (రోబస్ట్ డబుల్ స్పిండిల్ 360 డిగ్రీ టెక్నాలజీ) ద్వారా ల్యాపీని Notebook, Stand, Tent, Tablet ఇలా నాలుగు రకాల మోడ్‌లలో ఉపయోగించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iBall CompBook Aer3 With Rotatable Touchscreen Display, Windows 10 Launched at Rs.29,999. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot