రూ.14,299కే బ్రాండెడ్ ల్యాప్‌టాప్

ఐబాల్ కంపెనీ తన CompBook సిరీస్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. iBall CompBook Marvel 6 పేరుతో విడుదలైన ఈ ల్యాప్‌టాప్ ధర రూ.14,299. అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఈ ల్యాపీ లభ్యమవుతోంది. ఇదే ల్యాప్‌టాప్‌లో విండోస్ 10 ప్రో వర్షన్ కావాలంటే రూ.17,799 అవుతుంది.

రూ.14,299కే బ్రాండెడ్ ల్యాప్‌టాప్

ఐబాల్ కంప్‌బుక్ మార్వెల్ 6 ప్రత్యేకతలు.. 14 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 2.4గిగాహెట్జ్ ఇంటెల్ సెలిరాన్ ఎన్3350 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

రూ.14,299కే బ్రాండెడ్ ల్యాప్‌టాప్

స్టోరేజ్ సామర్థ్యాన్నిఆ తరువాత కూడా పెంచుకోవాలని అనుకుంటున్నట్లయితే 2.5ఇంచ్ 1TB హార్డ్‌డిస్క్ డ్రైవ్‌ను ల్యాపీలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మార్వెల్ 6 ల్యాపీ 38Wh Li-Polymer బ్యాటరీ పై రన్ అవుతుంది. డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, బ్లుటూత్, మినీ హెచ్ డిఎమ్ఐ, యూఎస్బీ 3.0 వంటి స్లాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను ఈ ల్యాపీ సపోర్ట్ చేస్తుంది.

English summary
iBall CompBook Marvel 6 laptop with 14-inch screen, 3GB RAM launched in India for Rs 14,299. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot