ఐబాల్ vs సామ్‌సంగ్ (టాబ్లెట్ ఫైట్)!

Posted By: Prashanth

ఐబాల్ vs సామ్‌సంగ్ (టాబ్లెట్ ఫైట్)!

 

టాబ్లెట్ పీసీలకు దేశవ్యాప్తంగా డిమాండ్ అధికమవుతున్న నేపధ్యంలో అనేక కంపెనీలు వీటి తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. తాజాగా ఐబాల్ సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్ ‘ఐస్లైడ్ ఐ9702’ను ఆకట్టుకునే ఫీచర్లతో విడుదల చేసింది. ధర రూ.14,999. ఐపీఎస్ డిస్‌ప్లే, డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇంకా క్వాడ్ కోర్ గ్రాఫిక్ వ్యవస్థలు ఈ డివైజ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆధునిక స్పెసిఫికేషన్ లను కలిగి ఉన్న ఐస్లైడ్ ఐ9702, సామ్ సంగ్ గెలాక్సీ టాబ్ 2తో పోటీపడగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ద్వితియ త్రైమాసికంలో విడుదలైన గెలాక్సీ టాబ్ 2 ధర రూ.19,300. ఈ నేపధ్యంలో రెండు టాబ్లెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా...

బరువు ఇంకా చుట్టుకొలత:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9702: తెలియాల్సి ఉంది,

గెలాక్సీ టాబ్ 2: శరీర పరిమాణం 193.7 x 122.4 x 10.5మిల్లీమీటర్లు, బరువు 345 గ్రాములు,

డిస్‌ప్లే:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9702: 9.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1024 x 786పిక్సల్స్),

గెలాక్సీ టాబ్ 2: 7 అంగుళాల పీఎల్ఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

ప్రాసెసర్:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9702: డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్,

గెలాక్సీ టాబ్ 2: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9702: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆఫరేటింగ్ సిస్టం,

గెలాక్సీ టాబ్ 2: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆఫరేటింగ్ సిస్టం,

కెమెరా:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9702: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

గెలాక్సీ టాబ్ 2: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9702: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

గెలాక్సీ టాబ్ 2: 8జీబి/16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9702: వై-ఫై, యూఎస్బీ వోటీజీ, హోస్ట్ పోర్ట్, హైడిఎమ్ఐ కనెక్టువిటీ,

గెలాక్సీ టాబ్ 2: వై-ఫై 802.11 బి/జి/ఎన్, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 3.0, మైక్రో యూఎస్బీ 2.0హోస్ట్,

బ్యాటరీ:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9702: 8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7 గంటల బ్యాకప్),

గెలాక్సీ టాబ్ 2: 4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, (20 గంటల టాక్‌టైమ్, 800 గంటల స్టాండ్‌బై),

ధర:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9702: ధర రూ.14,999,

గెలాక్సీ టాబ్ 2: 19,300.

ప్రీలోడెడ్ అప్లికేషన్స్:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9702: ఫేస్‌బుక్, జొమాటో, ఐబీఎన్ లైవ్, మనీ కంట్రోల్, నింబజ్, క్రికెట్ నెక్స్ట్, డాక్యుమెంట్ వ్యూవర్,

గెలాక్సీ టాబ్ 2: జీమెయిల్, యూట్యూబ్, సింక్ వింత్ గూగుల్ క్యాలెండర్, గూగుల్ సెర్చ్, గూగుల్+, గ్లోనాస్, సామ్‌సంగ్ హబ్, రీడర్ హబ్, గేమ్ హబ్, సామ్‌సంగ్ చాట్ ఆన్, సామ్‌సంగ్ కైస్, మై రీడర్,

తీర్పు:

ధర అదేవిధంగా స్పెసిఫికేషనల పరంగా ఆలోచించే వారికి ఐబాల్ ఐస్లైడ్ ఐ9702 ఉత్తమ ఎంపిక. గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్, అత్యధిక సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, ఉత్తమ స్ర్కీన్ డిస్‌ప్లే ఇంకా మన్నికైన కెమెరా పనితీరును కోరుకునే వారికి గెలాక్సీ టాబ్ 2 బెస్ట్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot