ఐబాల్ నుంచి సరికొత్త డ్యుయల్ సిమ్ 3జీ టాబ్లెట్

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ ‘3జీ 7271 హెచ్‌డి 7' మోడల్‌లో సరికొత్త డ్యుయల్ సిమ్ 3జీ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ధర రూ.8,999. ప్రస్తుతం ఈ టాబ్లెట్‌ను ebay.com వద్ద రూ.8,290కు పొందవచ్చు.
టాబ్లెట్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే... 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ సపోర్ట్, డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్ సపోర్ట్, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా టాబ్లెట్ స్టోరేజ్ మెమెరీని విస్తరించుకునే సౌలభ్యత, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








