రూ.8,299కే అత్యాధునిక 3జీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్
ఇండియా వంటి మధ్య తరగతి టెక్నాలజీ మార్కెట్లలో ట్యాబ్లెట్ కంప్యూటర్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా యువత ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ పరికరాల పై మక్కువ కనబర్చుతున్నారు. సామ్‌సంగ్, గూగుల్, హెచ్‌పి, లెనోవో వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే పలు ట్యబ్లెట్ మోడల్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. దేశవాళీ కంపెనీలైన మైక్రోమాక్స్, కార్బన్, ఐబాల్ వంటి బ్రాండ్‌లు సైతం ట్యాబ్లెట్ కంప్యూటర్ల తయారీ పై ఆసక్తిచూపుతున్నాయి.

తాజాగా, ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్, స్లైడ్ 3జీ7271 - హెచ్‌డి70(Slide 3G 7271-HD70) పేరుతో సరికొత్త 3జీ ఆధారిత ట్యాబ్లెట్ పీసీని మార్కెట్లో తీసుకువచ్చింది. డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్ సపోర్ట్ పై స్పందించే ఈ కంప్యూటింగ్ డివైస్ ధర రూ.8,299.
ట్యాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ వాయిస్ కాలింగ్ సపోర్ట్,
వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications