ఐబాల్ 3జీ వాయిస్ కాలింగ్ టాబ్లెట్
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో 3జీ వాయిస్ కాలింగ్ పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘ఐబాల్ స్లైడ్ 3జీ 7345క్యూ-800' మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ క్వాడ్‌కోర్ కంప్యూటింగ్ డివైస్‌ను ప్రముఖ రిటైలర్ Snapdeal రూ.10,349కి విక్రియిస్తోంది.
డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ టాబ్లెట్‌లో ఉన్నాయి.

ఐబాల్ స్లైడ్ 3జీ 7345క్యూ-800 పూర్తి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
డ్యూయల్ సిమ్ (3జీ వాయిస్ కాలింగ్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ (ఎంటీ8382) ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (వీడియో కాలింగ్ అలాగే సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, మైక్రోయూఎస్బీ, జీపీఎస్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్),
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








