ఐబాల్ డ్యూయల్ సిమ్ 3జీ టాబ్లెట్!

Posted By:

దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ ‘స్లైడ్ 3జీ క్యూ1035' పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్  టాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఐబాల్ అధికారిక వెబ్‌సైట్ అయిన iball.co.in  ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,999కి ఆఫర్ చేస్తోంది.

ఐబాల్ డ్యూయల్ సిమ్ 3జీ టాబ్లెట్!

Photo source- fonearena.com

టాబ్లెట్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే:

10.1 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), 3జీ వాయిస్ కాలింగ్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, ఆండ్రాయిడ్ 4.2జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 6000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్, ఎఫ్ఎమ్ రేడియో, వైఫై, బ్లూటూత్, జీపీఎస్. ఐబాల్ మహిళల కోసం ప్రత్యేకమైన భద్రతా ఫీచర్లతో కూడిన ‘అండీ ఉడాన్' స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.8,999.

ఈ 5 అంగుళాల స్మార్ట్‌ఫోన్ పింక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ఎస్ఓఎస్ బటన్, ఐసీఈ (ఇన్‌కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ), జీపీఎస్ ట్రాకింగ్ వంటి ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్లను ఈ హ్యాండ్‌సెట్ కలిగి ఉంది.

ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన ఎస్ఓఎస్ ఫంక్షన్ అత్యవసర సమయాల్లో ముందుగా ఎంపిక చేసుకున్నఫోన్ నెంబర్లు అలర్ట్ సందేశాలను పంపుతుంది. మరో ఫీచర్ ఐసీఈ (ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ)లో వినియోగదారునికి సంబంధించిన బ్లడ్ గ్రూప్, మెడికల్ హిస్టరీ ఇంకా ఎమర్జెన్సీ సమయంలో కాంటాక్ట్ చేయవల్సిన ఆప్తులకు సంబంధించిన వివరాలను స్టోర్ చేసుకోవచ్చు. ఫోన్ లో అదనంగా కల్పించిన జీపీఎస్ ట్రాకింగ్ ఫీచర్ ను ఏకకాంలో 10 నెంబర్లను ఎనేబుల్ చేయవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting