ఐబాల్ స్లైడ్ క్యూ900 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్ విడుదల!

Posted By:

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వేగవంతంగా విస్తరిస్తున్న బ్రాండ్ ఐబాల్. తాజాగా ఈ కంపెనీ, ఐబాల్ స్లైడ్ క్యూ900 పేరుతో సరికొత్త క్వాడ్ కోర్ ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అధికారిక ధర రూ.13,999. ప్రత్యేకమైన ధర తగ్గింపులో భాగంగా ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్ రూ.12,499కి లభ్యమవుతోంది. డివైస్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే......

చదవండి.. భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు

ఐబాల్ స్లైడ్ క్యూ900 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్ విడుదల!

7.85 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (హైడెఫినిషన్ రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, షార్ప్ ఇమేజ్ క్వాలిటీ),
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌలభ్యతతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్ డీడీఆర్3 ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్టాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
4000ఎమ్ఏహెచ్ పాలిమర్ బ్యాటరీ.
కనెక్టువిటి ఫీచర్లు: డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot