‘ఐ బాల్ స్లైడర్ ’ మీ విజయానికి తొలి అడుగు..!!

Posted By: Super

‘ఐ బాల్ స్లైడర్ ’ మీ విజయానికి తొలి అడుగు..!!


‘‘బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ చేతి మహత్యం ఏంటో గాని, ఆయన చేతిలో పడిన ప్రతి వస్తువు సూపర్ హిట్ కావాల్సిందే. తాజాగా ఈ కండల వీరుడు ప్రముఖ ‘ఐ బాల్’ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ‘ఐబాల్ స్లైడ్’ పేరుతో ఐబాల్ ప్రథమ టాబ్లెట్ పీసీ మార్కెట్లో విడుదలైంది. ఆధునిక సాంకేతిక వ్యవస్థతో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పీసీ వినియోగదారుడికి మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.’’

క్లుప్తంగా ఫీచర్లు:

- గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారింతంగా ఐ బాల్ స్లైడర్ రూపుదిద్దుకుంది.
- 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే నాణ్యమైన విజువల్ అనుభూతిని కలిగిస్తుంది.
- మెమరీని ఎక్సప్యాండబుల్ విధానం ద్వారా 32జీబికి వృద్థి చేసుకోవచ్చు.
- వై - ఫై, 3జీ వ్యవస్థను సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరుస్తాయి.
- పొందుపరిచిన హెచ్ డీఎమ్ఐ పోర్టు వ్యవస్థ ద్వారా హై డెఫినిషన్ వీడియోలను తిలకించవచ్చు.
- 4400 mAh లతియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక మన్నికను కలిగి ఉంటుంది.
- 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా నాణ్యమైన చిత్రాలను మీకు అందిస్తుంది.
- పొందుపరిచిన 3డీ గేమింగ్ వ్యవస్థ, విజువల్ సెర్చ్, వాయిస్ రికగ్నిషన్, వెబ్ బ్రౌసర్, ఇ - మెయిల్, సోషల్ నెట్ వర్కింగ్, ఇ - బుక్ తదితర ఆప్లికేషన్లు వినియోగదారుడికి మరింత లబ్థి చేకూరుస్తాయి.
- సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రూపొందించబడిన ఐ బాల్ స్లైడర్ ధర రూ.14,000/ ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot