అంచనాలు తుస్...!!

Posted By: Super

అంచనాలు తుస్...!!

 

స్మార్ట్‌ఫోన్స్ అదేవిధంగా టాబ్లెట్ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ ఐబాల్ అభిమానులను నిరుత్సాహపరిచింది. ఈ బ్రాండ్ నుంచి ఇదివరుకే విడుదలైన టాబ్లెట్ పీసీ ‘ఐబాల్ స్లైడ్ i7218’కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌ను ఐబాల్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో అభిమానులు

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వర్షన్‌ను ఆశించారు. వీరి అంచనాలను తలకిందులు చేస్తూ ఐబాల్ ‘స్లైడ్ i7218’ను ఆండ్రాయిడ్ 2.4 వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే, యూజర్లు నిరుత్సాహాపడాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ 2.4 ఆపరేటింగ్ సిస్టంలో ఒదిగి ఉన్న అనేక అంశాలు వినియోదారుకు ఉత్తమ కంప్యూటింగ్ అనుభూతులను చేరువచేస్తాయి. కొత్త వోఎస్‌ను లోడ్ చెయ్యటంతో కెమెరా, ఆడియో, యూఎస్బీ వ్యవస్థలు మరింత బలోపేతమవుతాయి.

అప్‌గ్రేడెడ్ వర్షన్ ‘ఐబాల్ స్లైడ్ i7218’ ఫీచర్లు:

టాబ్లెట్ బరువు 450 గ్రాములు,

7 అంగుళాల మల్టీ టచ్ డిస్‌ప్లే స్ర్కీన్,

రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

1గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

8జీబి బుల్ట్-ఇన్ స్టోరేజ్,

వై-ఫై సౌకర్యం,

బ్లూటూత్ కనెక్టువిటీ,

3జీ ఫీచర్స్,

హెచ్‌డిఎమ్ఐ పోర్టు.

ప్రయాణ సమయాల్లో కంప్యూటింగ్ అవసరాలను తీర్చేందుకు ఈ డివైజ్ ఉపయుక్తంగా నిలుస్తుంది. ఏర్పాటు చేసిన హెచ్‌డిఎమ్‌ఐ పోర్టు సౌలభ్యతతో టాబ్లెట్‌ను టీవీ ఇతర ప్రొజెక్టర్లకు అనుసంధానం చేసుకోవచ్చు. డాంగిల్ సహాయంతో 3జీ ఫీచర్లను ఆస్వాదించవచ్చు.

పొందుపరిరచిన వై-ఫై కనెక్టువిటీతో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను ఉఫయోగించుకోవచ్చు. ఏర్పాటు చేసిన 7 అంగుళాల స్ర్కీన్ ఉత్తమ విజువల్ అనుభూతులకు లోను చేస్తుంది. బాహ్య మెమరీని 32జీబి వరకు పొడిగించుకోవచ్చు. ధర అంచనా రూ.12,000. రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డెటేడ్ గ్యాడ్జెట్‌లను విడుదల చేసేందుకు ఐబాల్ సన్నాహాలు చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot