చెర్రీ లాంటి బెర్రీ ఎంత మందిని రచ్చ చేస్తుందో..?

By Prashanth
|
iBerry BT07i Tablet


ప్రముఖ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ సంస్థ ఐబెర్రీ తక్కువ ధర కంప్యూటింగ్ పీసీల నిర్మాణం పై దష్టి సారించి 8 వేల రేంజ్‌లో ఓ చవకైన ఫీచర్ రిచ్ టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. ఈ డివైజ్ మోడల్ BT07i, పూర్తి స్థాయి టచ్ స్ర్కీన్ వ్యవస్ధ పై స్పందించే ఈ గ్యాడ్జెట్ మిమ్మల్ని కొత్త అనుభూతులకు లోను చేస్తుంది. స్ర్కీన్ కింద భాగంలో అమర్చిన మెనూ, హోమ్, బ్యాక్ బటన్లు ప్రొఫెషనల్ లుక్‌ను కలిగి ఉంటాయి.

టాబ్లెట్ ఫీచర్లు క్లుప్తంగా:

* 7 అంగుళాల టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800×480 పిక్సల్స్),

* టచ్‌స్ర్కీన్,

* బరువు 376 గ్రాములు,

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 1 జిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

* 400 మెగాహెడ్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

* 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్య్షక్ష వీడియో ఛాటింగ్ కొరకు),

* 512 ఎంబీ డీడీఆర్2 ర్యామ్,

* 4జీబి ఇంటర్నల్ మెమెరీ,

* మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు,

* 3జీ, వై-ఫై, యూఎస్బీ, హెచ్ డిఎమ్ఐ అవుట్,

* నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ),

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, స్పీకర్స్, ఆడియో జాక్,

* బ్యాటరీ మ్యూజిక్ స్టాండ్ బై 35గంటలు, వీడియో స్టాండ్ బై 5 గంటలు, బ్రౌజింగ్ స్టాండ్ బై 6 గంటలు.

ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోకి ప్రవేశించే అప్లికేషన్లను ముందుగానే టాబ్లెట్‌లో ఇన్‌బుల్ట్ చేశారు. ఈ పీసీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌తో పాటు మల్టీ ఫార్మట్ ఈ-బుక్‌లను సపోర్ట్ చేస్తుంది. ఫీచర్లు నచ్చిన వారు రూ.8.000 చెల్లించి ఈ డివైజ్‌ను సొంతం చేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X