‘ఐబెర్రీ’ కొత్త ట్రెండ్ రూ.7,000లకే ఆధునిక టాబ్లెట్!!

Posted By: Super

‘ఐబెర్రీ’ కొత్త ట్రెండ్ రూ.7,000లకే ఆధునిక టాబ్లెట్!!

టాబ్లెట్ పీసీల మార్కెట్లో ధరల యుద్ధం మొదలైంది. ఇప్పటికే ‘బీటెల్ మ్యాజిక్’ రూ.9000, ‘రిలయన్స్’ రూ.12,999, మెర్క్యురీ రూ.9499లకు టాబ్లెట్ పీసీలను అందిస్తన్న విషయం తెలిసిందే. హాంగ్ - కాంగ్ సంస్థ అయిన ‘ఐబెర్రీ’ ఇండియన్ ‘టాబ్లెట్ కంప్యూటర్ల’ మార్కెట్లో కొత్త ఒరవడికి నాంది పలకనుంది. కేవలం రూ.7,000కే అత్యాధునిక టాబ్లెట్ పరికరాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. అక్టోబర్ 10న సంస్థ నిర్వహించబోయే కార్యక్రమంలో ఈ గ్యాడ్జెట్లను లాంఛ్ చేయునున్నారు. 7 మురియు 10 అంగుళాల టాబ్లెట్లను ‘ఐబెర్రీ’ కార్యక్రమంలో విడుదల చేయునుంది.

‘ఐబెర్రీ’ 7 అంగుళాల ‘BT07’ క్లుప్తంగా:

- ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ టాబ్లెట్ పీసీ రూపుదిద్దుకుంది.
- 4జీబీ ఇంటర్నెల్ మెమరీని, ఎక్సటర్నల్ స్లాట్ సౌలభ్యతతో 32జీబీకి వృద్థి చేసుకోవచ్చు.
- 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, 800 x 480 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.
- అత్యాధునిక గ్యేమింగ్ వ్యవస్థకు ఉపకరించే గైరో బేసిడ్ మోషన్ సెన్సార్‌ను టాబ్లెట్‌లో పొందుపరిచారు.
- పొందుపరిచిన 10.3 ఫ్లాష్ సపోర్టు వ్యవస్థ వీడియో స్ట్రీమింగ్ మరియు వెబ్ బ్రౌజింగ్‌కు ఉపకరిస్తుంది.
- ARM Cortex A8 1.2 Ghz ప్రొసెసర్, 512 MB DDR2 ర్యామ్ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి.

‘ఐబెర్రీ’ 10 అంగుళాల ‘BT10’ ఫీచర్లు క్లుప్తంగా:

- 10 అంగుళాల 6 పాయింట్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 1024 x 600 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.
- ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ టాబ్లెట్ పీసీ రూపుదిద్దుకుంది.
- 4జీబీ ఇంటర్నెల్ మెమరీని, ఎక్సటర్నల్ స్లాట్ సౌలభ్యతతో 32జీబీకి వృద్థి చేసుకోవచ్చు.
- ARM Cortex A8 1.2 Ghz ప్రొసెసర్, 512 MB DDR2 ర్యామ్ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి.
- పొందుపరిచిన 10.3 ఫ్లాష్ సపోర్టు వ్యవస్థ వీడియో స్ట్రీమింగ్ మరియు వెబ్‌బ్రౌజింగ్‌కు ఉపకరిస్తుంది.
- అత్యాధునిక గ్యేమింగ్ వ్యవస్థకు ఉపకరించే గైరో బేసిడ్ మోషన్ సెన్సార్‌ను టాబ్లెట్‌లో పొందుపరిచారు.
- 3జీ,2జీ సిమ్‌లను ఈ టాబ్లెట్ సపోర్టు చేస్తుంది.
- సంవత్సరం వారెంటీతో లభ్యమయ్యే ఈ టాబ్లెట్ పీసీ ధర రూ. 14,990 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot