కేవలం 9,990లకే ఐబెర్రీ కంప్యూటర్!!

Posted By: Prashanth

కేవలం 9,990లకే ఐబెర్రీ కంప్యూటర్!!

 

చెన్నైఆధారిత దేశీయ కంపెనీ ఐబెర్రీ తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్‌ను రూపొందించింది. ఆండ్రాయిడ్ ఆధునిక ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్విచ్ పై ఈ డివైజ్ రన్ అవుతుంది. ‘ఐబెర్రీ ఆక్సస్ ఏఎక్స్ 02’గా మార్కెట్‌కు పరిచయంకానున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ధర రూ.9,990.

నిక్షిప్తం చేసిన 1జిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్ పీసీ పనితీరును పర్యవేక్షిస్తుంది. ఏర్పాటు చేసిన 1జీబి డిడిఆర్2 ర్యామ్ వ్యవస్థ డేటా వ్యవస్థను పటిష్ట పరుస్తుది. 7 అంగుళాల స్ర్కీన్ మల్టీ టచ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన వై-ఫై అప్లికేషన్ నెట్ బ్రౌజింగ్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా టాబ్లెట్ మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు. యూఎస్బీ పోర్టు సాయంతో ఇతర పరకరాలకు టాబ్లెట్‌ను అనుసంధానించుకోవచ్చు. హెచ్‌డిఎమ్‌ఐ పోర్టు సౌలభ్యతతో హె‌డెఫినిషన్ టీవీలకు పీసీని జత చేసుకోవచ్చు. సంవత్సరం వారంటీతో లభ్యమవుతున్న ఐబెర్రీ ఆక్సస్ ఏఎక్స్ 02ను ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కోనుగోలు చేయ్యవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot