అన్నయ్య ప్లేస్‌కి తమ్ముడి ఎర్త్!

చెన్నై ఆధారిత కంపెనీ ఐబెర్రీ, దేశీయ యూజర్ల కోసం అత్యాధునిక ఫీచర్లు కలిగిన టాబ్లెట్ కంప్యూటర్లను రూపొందింస్తూ తన ఉనికిని మరింత పెంచుకుంటోంది. ఈ బ్రాండ్ నుంచి గతంలో విడుదలైన ఐబెర్రీ AX02 (ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్ పీసీ) అప్పట్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గ్యాడ్జెట్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ఐబెర్రీ, ఆక్సస్ AX03Gను డిజైన్ చేసింది. ఉత్తమ కంప్యూటింగ్ స్పెసిఫికేషన్ లను ఒదిగి ఉన్న ఆక్సస్ AX03G ఫీచర్లు...
7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్800 x 480పిక్సల్స్),
గైరో సెన్సార్,
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటిగ్ సిస్టం,
1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
గ్రాఫిక్ చిప్,
ఎక్సటర్నల్ మెమరీ 16జీబి,
2మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇన్‌బుల్ట్ స్లిమ్ స్లాట్,
జీఎస్ఎమ్ (2జీ,3జీ నెట్‌వర్క్ సపోర్ట్),
వై-ఫై,
బ్లూటూత్,
మినీ యూఎస్బీ పోర్టు,
హెచ్‌డిఎమ్ఐ అవుట్,
1 సంవత్సరం వారంటీ,
ధర రూ.9,990.
ఐబెర్రీ AX02 ఫీచర్లు:
చెన్నై బ్రాండ్ ఐబెర్రీ ఇదువురుకే పరిచయం చేసిన టాబ్లెట్ పీసీ ‘ఐబెర్రీ AX02’. ఆండ్రాయిడ్ ఆధునిక ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్విచ్ పై డివైజ్ రన్ అవుతుంది. నిక్షిప్తం చేసిన 1గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్ పీసీ పనితీరును పర్యవేక్షిస్తుంది. ఏర్పాటు చేసిన 1జీబి డిడిఆర్2 ర్యామ్ వ్యవస్థ డేటా వ్యవస్థను పటిష్ట పరుస్తుది. 7 అంగుళాల స్ర్కీన్ మల్టీటచ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన వై-ఫై అప్లికేషన్ నెట్ బ్రౌజింగ్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా టాబ్లెట్ మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు. యూఎస్బీ పోర్టు సాయంతో ఇతర పరకరాలకు టాబ్లెట్‌ను అనుసంధానించుకోవచ్చు. హెచ్‌డిఎమ్‌ఐ పోర్టు సౌలభ్యతతో హెడెఫినిషన్ టీవీలకు పీసీని జత చేసుకోవచ్చు. సంవత్సరం వారంటీతో లభ్యమవుతున్న ఐబెర్రీ ఆక్సస్ ఏఎక్స్ 02ను ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కోనుగోలు చేయ్యవచ్చు. ధర 7,990.


Click it and Unblock the Notifications