ఐబెర్రీ నుంచి రెండు సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

Posted By: Staff

 ఐబెర్రీ నుంచి రెండు సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

 

ప్రముఖ దేశవాళీ బ్రాండ్ ఐబెర్రీ వేరు వేరు ప్రాసెసర్‌లతో రెండు సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లను విఫణిలోకి తీసుకువచ్చింది. అక్సస్ కోర్ ఎక్స్4, అక్సస్ కోర్ ఎక్స్ 2 మోడళ్లలో రెండు కొత్త శ్రేణి ట్యాబ్లెట్ పీసీలను ఐబెర్రీ  శుక్రవారం ఆవిష్కరించింది. ఈ కంప్యూటింగ్ డివైజ్‌ల ద్వారా 3జీ వాయిస్ కాలింగ్ నిర్వహించుకోవచ్చు. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా......

పైసా ఖర్చు లేకుండా ‘సిక్స్ ప్యాక్’..!

అక్సస్ కోర్ ఎక్స్4:

9.7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1024x 768పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.0 ఆకా ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

సామ్‌సంగ్ ఎక్సినోస్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.6గిగాహెట్జ్),

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,

3జీ సిమ్ స్లాట్ (3జీ వాయిస్ కాలింగ్ నిర్వహించుకునేందుకు),

వై-పై, బ్లూటూ్త్ 4.0, జీపీఎస్, హెచ్‌డిఎమ్ఐ అవుట్, జీ-సెన్సార్,

7200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.15,900.

అక్సస్ కోర్ ఎక్స్2:

7 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.1 ఆకా జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.6గిగాహెట్జ్),

1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

3జీ సిమ్‌స్లాట్ ( 3జీ వాయిస్ కాలింగ్ నిర్వహించుకునేందుకు),

వై-పై, బ్లూటూ్త్ 4.0, జీపీఎస్, హెచ్‌డిఎమ్ఐ అవుట్, జీ-సెన్సార్,

4,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.10,990.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot