ఒక్క హిట్టుతో ఇమేజ్ పైపైకి!!

Posted By: Staff

 ఒక్క హిట్టుతో ఇమేజ్ పైపైకి!!

 

టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ బ్రాండ్ ఐబెర్రీ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఇటీవల ఈ సంస్థ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన అప్‌డేటెడ్ ‘ఐబెర్రీ బీటీ07ఐ’ టాబ్లెట్ పీసీని భారత్‌లో లాంఛ్ చేసింది. ఫలితంగా యూజర్లు, విశ్లేషకుల నుంచి సంతృప్తి వ్యక్తమవటంతో భవిష్యత కార్యచరణను మరింత పటిష్టితం చేసే పనిలో బ్రాండ్ వర్గాలు నిమగ్నమయ్యాయి.

తాజా ఐసీఎస్ అప్‌డేట్‌తో ‘ఐబెర్రీ బీటీ07ఐ’కు కలిసొచ్చే అంశాలు:

- కెమెరా అప్లికేషన్ మరింత మెరుగైన ప్రదర్శనను కనబరుస్తుంది.

- బ్యాటరీ బ్యాకప్ అదనంగా పెరుగుతుంది,

- గ్యాలరీ అప్లికేషన్ మరింత మెరుగుపడుతుంది,

- వేగవంతమైన మల్టీ టాస్కింగ్ నిర్వహించుకోవచ్చు.

ఐబెర్రీ టాబ్లెట్ కీలక ఫీచర్లు

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800×480పిక్సల్స్),

512ఎంబీ ర్యామ్,

1గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

శక్తివంతమైన ఫ్రంట్ కెమెరా,

వై-పై కనెక్టువిటీ,

3జీ డాంగిల్

ఐబెర్రీ బీటీ07ఐ టాబ్లెట్ పీసీ యూజర్లు ఈ తాజా అప్‌డేట్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి నేరుగా పొందవచ్చు. ఈ అప్‌డేట్‌కు సంబంధించిన ఫైల్ పరిమాణం 250ఎంబీ ఉంటుంది. కొత్త యూజర్లు ఐసీఎష్ వోఎస్ లోడ్ చేసిన పీసీని పొందవచ్చు. ఉత్తమ కంప్యూటింగ్ విలువతో రూపుదిద్దుకున్న ‘ఐబెర్రీ BT07i’ తక్కువ ధరకే లభిస్తున్న టాబ్లెట్ పీసీలలో ఉత్తమమైనది. మార్కెట్లో ఈ డివైజ్ ధర అంచనా రూ.8,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting