ఆరంభం అదిరింది... బెర్లిన్‌లో గెలాక్సీ నోట్2 ఆవిష్కరణ!

By Prashanth
|
Samsung Galaxy Note 2

బెర్లిన్ నగరం వెలుగు జిలుగుల మధ్య బుధవారం గెలాక్సీ నోట్ 2 ఫాబ్లెట్‌ను సామ్‌సంగ్ ప్రకటించింది. గెలాక్సీ నోట్‌కు ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా రూపుదిద్దుకున్న నోట్ 2 ఇంచుమించు గెలాక్సీ ఎస్3 పోలికలను కలిగి ఉంది. ఇక డివైజ్ ఫీచర్లను పరిశీలిస్తే... 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3,100ఎమ్ఏఎచ్ బ్యాటరీ. 16, 32, 64జీబి మెమరీ వేరియంట్‌లలో నోట్ 2 లభ్యంకానుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ అదనం. మార్బుల్ వైట్, టైటానియమ్ గ్రే కలర్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ మల్టీ పర్పస్ గ్యాడ్జెట్ అక్టోబర్ నాటికి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.

Read In English

ఎస్-పెన్ సౌలభ్యత

ఎస్-పెన్ ఫీచర్ గెలాక్సీ నోట్ 2లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. టచ్ ఆధారితంగా స్పందించే ఈ పెన్ ఫాబ్లెట్ పై రైటింగ్‌కు మరింత అనువుగా ఉంటుంది. దాదాపు అన్ని అప్లికేషన్‌లను ఈ టచ్ రెస్పాన్స్ పెన్ ఆధారితంగా ఆపరేట్ చేసుకోవచ్చు.

అదనపు ఫీచర్లు:

గెలాక్సీ నోట్‌తో పోలిస్తే నోట్ 2లో పలు కొత్త ఫీచర్లు అదనంగా వచ్చి చేరాయి. వాటిలో మొదటిది ‘ఎయిర్ వ్యూ’. ఈ ఫీచర్ సౌలభ్యతతో స్ర్కీన్‌ను టచ్ చేయకుండా ఎస్-పెన్ సహకారంతో లావాదేవీలను నిర్విహించుకోవచ్చు. మరో ఫీచర్ పాప్-అప్ నోట్. ఈ ఫీచర్ డెస్క్‌టాప్ పై మరో అప్లికేషన్ రన్ అవుతుండగానే నోట్స్ తీసుకుంటుంది. మరో ఫీచర్ క్విక్ కమాండ్ ఈ-మెయిల్, సెర్చ్, వాయిస్ కాల్స్‌ను త్వరితగతిన నిర్వహించుకునేందుకు క్విక్ షార్ట్ కట్‌లను ఏర్పాటు చేస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X