మంగళయాన్ ఉపగ్రహంతో ‘సెల్ఫీ’

Posted By:

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్మార్టర్, ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఓఎస్ మొబైల్ డివైస్‌ల కోసం స్మార్టర్ మంగళయాన్ పేరుతో సరికొత్త ఆగ్‌మెంటెడ్ రియాలిటీ మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్స్ ఆర్బిటర్ బిషన్ (మామ్)ను గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయోగాన్ని స్వయంగా చూసిన అనుభూతులతో మొబైల్‌లో వీక్షించేందుకు ఈ అప్లికేషన్ తోడ్పడుతుంది.

 మంగళయాన్ ఉపగ్రహంతో ‘సెల్ఫీ’

ఈ నెల 24న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంగారక గ్రహం పైకి ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఆ గ్రహకక్ష్యలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ యాప్‌ను విడుదల చేసారు. ఈ స్మార్టర్ మంగళయాన్ యాప్ ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ప్లాట్‌ఫాంల పై పనిచేస్తుంది.

ఈ అప్లికేషన్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకునే ఔత్సాహికులు మరికొద్ది గంటల్లో అంగారక గ్రహంలోకి చేరుకోనున్న మంగళయాన్ ఉపగ్రహంతో ఎంచక్కా సెల్ఫీలను కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన కెమెరాను ఆప్షన్‌ను ఈ యాప్‌లో ఉంచారు. అంతేకాకుండా మంగళయాన్‌కు సంబంధించిన వివిధ పరికరాలు అలానే ఉపగ్రహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. అంగారకుడు, సూర్యుడు, భూమి ఒకరి చుట్టూ ఒకరు తిరిగే కక్ష్యను 3డీ రూపంలో వీక్షించే అవకాశాన్ని ఈ స్మార్ట్ మంగళయాన్ యాప్ కల్పిస్తోంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/QnCSGHWLA7c?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
India-based Start-up launches Mobile App for Clicking Selfie with Mangalyaan. Read more in Telugu Gizbot.......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting