Apple కొత్త ప్రొడక్ట్స్ ఇండియా ధరలు ఇవే
2017 వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా Apple సరికొత్త ప్రొడక్ట్స్‌ను అనౌన్స్ చేసింది.
శాన్ జోస్ వేదికగా సోమవారం ప్రారంభమైన 2017 వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా Apple సరికొత్త ప్రొడక్ట్స్‌ను అనౌన్స్ చేసింది. వీటిలో ఐప్యాడ్ ప్రో మోడల్స్‌తో పాటు మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్, మ్యాక్‌బుక్ ప్రోలు ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో వీటి ధరలకు సంబంధించిన వివరాలను యాపిల్ ఇండియా వెబ్‌సైట్ ప్రొడక్ట్ పేజీల్లో అప్‌డేట్ చేయటం మొదలు పెట్టింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

ఐప్యాడ్ ప్రో
WWDC 2017 వేదికగా ఆపిల్ అనౌన్స్ చేసిన న్యూ ఐప్యాడ్ ప్రో రెండు స్క్రీన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.10.5 అంగుళాల స్క్రీన్ వేరియంట్‌తో వచ్చే న్యూ ఐప్యాడ్ ప్రో ధరలు ఈ విధంగా ఉన్నాయి.
వై-ఫై ఓన్లీ మోడల్... 64జీబి వేరియంట్ ధర రూ.52,900, 256జీబి వేరియంట్ ధర రూ.60,900, 512జీబి వేరియంట్ ధర రూ.76,900.
వై-ఫై + సెల్యులార్ మోడల్... 64జీబి వేరియంట్ ధర రూ.63,900, 256జీబి వేరియంట్ ధర రూ.71,900, 512జీబి వేరియంట్ ధర రూ.87,900.

12.9 అంగుళాల స్క్రీన్ వేరియంట్‌తో వచ్చే ఐప్యాడ్ ప్రో ధరలు..
12.9 అంగుళాల స్క్రీన్ వేరియంట్‌తో వచ్చే ఐప్యాడ్ ప్రో ధరలు ఈ విధంగా ఉన్నాయి...
వై-ఫై ఓన్లీ మోడల్... 64జీబి వేరియంట్ ధర రూ.65,900, 256జీబి వేరియంట్ ధర రూ.73,900, 512జీబి వేరియంట్ ధర రూ.89,900.
వై-ఫై + సెల్యులార్ మోడల్... 64జీబి వేరియంట్ ధర రూ.76,900, 256జీబి వేరియంట్ ధర రూ.84,900, 512జీబి వేరియంట్ ధర రూ.1,00,900

మ్యాక్‌బుక్ ఎయిర్
న్యూ మ్యాక్‌బుక్ ఎయిర్ డివైస్ మైన్ స్పీడ్ బంప్‌ను అందుకోవటంతో ధర కాస్త పెరిగింది. ఈ డివైస్‌లోని ప్రస్తుతం ఉన్న 1.6గిగాహెట్జ్ కోర్ ఐ5 బ్రాడ్‌వెల్ చిప్ (టర్బో బూస్ట్ అప్ టు 2.7గిగాహెట్జ్)ను, 1.8గిగాహెట్జ్ కోర్ ఐ5 బ్రాడ్‌వెల్ చిప్ (టర్బో బూస్ట్ అప్ టు 2.6గిగాహెట్జ్)కు అప్‌గ్రేడ్ చేసారు. 128జీబి వర్షన్ ధర రూ. 80,900, 256జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.96,900.

మ్యాక్‌బుక్ ప్రో
టచ్ బార్ లేకుండా వస్తోన్న 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ వేరియంట్ ధరను రూ.1,09,900గా యాపిల్ నిర్ణయించింది. 128జీబి స్టోరేజ్ కెపాసిటీని ఈ డివైస్ కలిగి ఉంటుంది. 256జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,26,900గా ఉంది. టచ్ బార్‌తో వచ్చే 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో వేరియంట్ ధర 256జీబి మోడల్‌కు గాను రూ.1,71,900గా ఉంది. 256జీబి వేరియంట్ ధర రూ.1,71,900గా ఉంది. టచ్ బార్‌తో వచ్చే 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో వేరియంట్ ధర 256జీబి మోడల్‌కు గాను రూ.2,05,900గా ఉంది. 256జీబి వేరియంట్ ధర రూ.2,39,900గా ఉంది.

మ్యాక్‌బుక్
సింగిల్ యూఎస్బీ టైప్-సీ పోర్టుతో వస్తోన్న 12 అంగుళాల మ్యాక్‌బుక్ ధర 256జీబి మోడల్‌కు గాను 1,09,900గా ఉంది. 512జీబి వేరియంట్ ధర రూ.1,34,900గా ఉంది.

ఐమ్యాక్
తాజా ధర అప్‌డేట్‌లో భాగంగా ఐమ్యాక్ రేంజ్ 21.5 ఇంచ్ నాన్ రెటీనా మోడల్ రూ.90,900 నుంచి ప్రారంభమవుతుంది. 21.5 ఇంచ్ రెటీనా ఐమ్యాక్ మోడల్ ధర రూ.1,07,900గా ఉంది. 27.5 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌లో వస్తోన్న రెటీనా ఐమ్యాక్ ధర రూ.1,48,900గా ఉంది.


Click it and Unblock the Notifications