88 శాతం పెరిగిన ఈ-కామర్స్ వ్యాపారం: సర్వే

Posted By:

ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరగటంతో పాటు, మరిన్ని ఆన్‌లైన్ నగదు చెల్లింపు స్కీమ్‌లు అందుబాటులోకి రావటంతో భారత్ ఇ-కామర్స్ వ్యాపారం 2013లో మరింతగా పుంజుకుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీ ఎస్ రావత్ తెలిపారు.

 88 శాతం పెరిగిన ఈ-కామర్స్ వ్యాపారం: సర్వే

ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో పాటు ఆయా ఉత్పత్తులకు సంబంధించిన ఉపకరణాలు, జ్యూయలరీ, గృహోపకరణాలు, జీవనశైలి ఉపకరణాలైన వాచ్‌లు, పుస్తకాలు, సౌందర్య ఉత్పత్తులు, పరిమళ ద్రవ్యాలు, చిన్నారుల ఉత్పత్తులు వంటి అమ్మకాలు 2013 భారత్ ఈ-కామర్స్ వ్యాపారం ఎదుగుదలకు తోడ్పడ్డాయని రావత్ అన్నారు.

ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్ 2013కు సంబంధించి అసోచామ్ నిర్వహించిన సర్వేలో భాగంగా ఈ ఏడాదికిగాను ఆన్‌లైన్ మార్కెట్ వృద్ధి 88శాతంగా నమోదైనట్లు వెల్లడైంది. అసోచామ్ సర్వే ప్రకారం 2009లో ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్ విలువ యూఎస్‌డి 2.5 బిలియన్‌ల వద్ద ఉంది., 2012 నాటికి ఈ విలువ యూఎస్‌డి 8.5 బిలియన్‌లుగా నమోదైంది. 2013 నాటికి ఈ విలువ మరింతగా పుంజుకుని 88శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ పరిణామంతో 2013 భారత్ ఈ-కామర్స్ మార్కెట్ విలువ యూఎస్‌డి 16 బిలియన్‌లకు చేరకుంది. 2023 నాటికి ఇండియన్ ఆన్‌లైన్ రిటైలింగ్ వ్యాపారం విలువ యూఎస్‌డి 56 బిలియన్‌లకు విస్తరించే అవకాశం ఉందని అసోచామ్ సర్వే అంచానా వేస్తోంది.

ఈ సర్వేలో భాగంగా అసోచామ్.. ఢిల్లీ, ముంబయ్, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాడ్, కోల్ కతా వంటి నగరాలలోని 3500 మంది వ్యాపారులు ఇంకా వ్యవస్థీకృత రిటైలర్ల నుంచి స్పందనలను సేకరించింది. ఆన్ లైన్ షాపర్లు అత్యధికంగా ఉన్న నగరంగా ముంబయ్ మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో ఢిల్లీ మూడవ స్థానంలో కోల్‌కతా నగరాలు  నిలిచాయి. అగష్టు 2013 నాటికి ఇండియా 150 మిలియన్ల ఇంటర్నెట్ విస్తృత బేస్‌ను కలిగి ఉన్నట్లు అసోచామ్ సర్వే వెల్లడించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot