బెంగుళూరు కంపెనీ ‘టెక్’ వండర్!!

Posted By: Super

బెంగుళూరు కంపెనీ ‘టెక్’ వండర్!!

 

దేశంలో సాంకేతిక పరిజ్ఞానం అభివ్ళద్ది చెందుతోంది. ప్రపంచ దేశాలకు ధీటుగా మన వారు కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడతున్నారు. ఈ కోవకే చెందిన బెంగుళూరు కంపెనీ అస్మయత యూఎస్బీ 3.0 పోర్ట్ తో రూపుదిద్దుకున్న ప్రపంచపు మొట్టమొదటి ఆండ్రాయిడ్ టాబ్లెట్ కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. ‘స్ళటా’(Sruta)గా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పీసీ శక్తివంతమైన డ్యూయల్ కోర్ ST-Ericsson Nova A9500 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. టాబ్లెట్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే...

*   ఆండ్రాయిడ్ 4.X ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

*   7 మెగా పిక్సల్ మల్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800×480 పిక్సల్స్) ,

*   8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

*   2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

* 8జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్,

*   1జీబి ర్యామ్,

*  మెక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా జీబిని 32కు పెంచుకునే వెసలుబాటు,

*  వై-ఫై, 3జీ, బ్లూటూత్, జీపీఎస్,

*  యూఎస్బీ 2.0, 3.0 హై స్పీడ్ కనెక్టర్,

*  జీ-సెన్సార్, ఇ-కంపాస్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరో స్కోప్ సెన్సార్, జీపీఎస్,

*  3.5ఎమ్ఎమ్ స్టీరియో హెడ్ సెట్, హెడ్ ఫోన్, మైక్రో ఫోన్ జాక్, ఇంటర్నల్ స్టీరియో స్పీకర్స్,

*  రీఛార్జ్‌బుల్ 6000 mAh బ్యాటరీ,

త్వరలో మార్కెట్లోకి రానున్న స్ళటి టాబ్లెట్ ప్రారంభ ధర 200 డాలర్లు, ఇండియన్ కరెన్సీలో రూ.9838.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot