Home
Computer

Infinix నుంచి అక్టోబర్‌ 17న ల్యాప్‌టాప్‌, తొలి ఫ్లిప్‌ ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు..!

ఇన్ఫినిక్‌ నుంచి భారత్‌ మార్కెట్‌ లోకి మరో ల్యాప్‌ టాప్ విడుదల కానుంది. ఇన్ఫినిక్స్‌ ఇన్‌బుక్‌ ఎయిర్‌ ప్రో+ పేరుతో అక్టోబర్‌ 17 న లాంచ్‌ కానుంది. ఈ ల్యాప్‌టాప్‌ సన్నని డిజైన్‌ ను కలిగి ఉంటుంది. అల్యూమినియం, మెగ్నిషియం మిశ్రమంతో కూడిన మెటల్‌ ఫినిష్‌ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ల్యాప్‌టాప్‌ ప్రీమియం AG గ్లాస్‌ టచ్‌ ప్యాడ్‌ మరియు టచ్‌లిట్‌ కీబోర్డుతో అందుబాటులోకి రానుంది. విండోస్‌ 11 OS తో పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌ తోపాటు ఇన్ఫినిక్స్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్ కూడా భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానుంది.

ఇన్ఫినిక్స్‌ ఇన్‌బుక్‌ ఎయిర్‌ ప్రో+ ల్యాప్‌ టాప్‌ (Infinix Inbook Air Pro+ Laptop) కోపైలెట్‌ AI బటన్‌తో విడుదల కానుంది. అయితే 91మొబైల్స్‌ నివేదిక ప్రకారం ఈ ల్యాప్‌టాప్‌ 14 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే QHD+ డిస్‌ప్లేతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 2880*1800 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంటుందని సమాచారం.

Infinix Inbook Air Pro  Laptop

ప్రాసెసర్, OS వివరాలు :
దీంతోపాటు ఈ ఇన్ఫినిక్స్ ల్యాప్‌ టాప్‌ Intel core i5 1334U ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ Intel Iris Xe గ్రాఫిక్స్‌ G7 ఇంటిగ్రేటెడ్‌ గ్రాఫిక్స్‌ తో జతచేసి ఉంటుంది. 16GB LPDDR4X 4266MHz ర్యామ్ మరియు 512GB SSD స్టోరేజీని కలిగి ఉంటుంది. మరియు విండోస్‌ 11 OS తో పనిచేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు :
ఇన్ఫినిక్స్‌ ఇన్‌బుక్‌ ఎయిర్‌ ప్రో+ ల్యాప్‌టాప్‌ బరువు 1KG ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ ఇన్ఫినిక్స్‌ అధికారిక వెబ్‌సైట్‌, ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ల్యాప్‌టాప్‌తోపాటు అక్టోబర్‌ 17 వ తేదీన తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ఇన్ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ (Infinix Zero Flip Phone) లాంచ్ కానుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 3.64 అంగుళాల కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

50MP సెల్ఫీ కెమెరా :
ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ 1100 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లా్స్‌ విక్టస్‌ 2 రక్షణతో అందుబాటులోకి రానుంది. ఈ ఇన్ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ ఫోన్‌ 50MP OIS కెమెరాను కలిగి ఉంది. మరియు 50MP అల్ట్రావైడ్‌ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి రానుంది. ఈ కెమెరాలతో 4K రిజల్యూషన్‌ తో వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Inbook Air Pro+ Laptop and first ever flip phone to launch on october 2024 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X