Home
Computer

Infinix Inbook Y4 Max ల్యాప్‌టాప్ లాంచ్ అయింది!ధర,స్పెసిఫికేషన్లు

ఇన్ఫినిక్స్ భారతదేశంలో కొత్త ల్యాప్‌టాప్‌ను ప్రకటించింది. ఇది ఈ బ్రాండ్ సరికొత్త ల్యాప్‌టాప్ పోర్ట్‌ఫోలియోలో తాజా లైనప్. ఈ Infinix INBook Y4 Max గత నెలలో, బ్రాండ్ INBook Y2 ప్లస్ లాంచ్ సమయంలో ప్రకటించింది.

ఈ రోజు భారత మార్కెట్లో లాంచ్ అయింది, INBook Y4 Max పెద్ద డిస్‌ప్లే మరియు 13వ తరం ఇంటెల్ ప్రాసెసర్‌లను కలిగి ఉంది.ఈ పరికరం బాక్స్ వెలుపల ఏమి ఆఫర్ చేస్తుందో స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకోవడానికి చదవండి.

Infinix Inbook Y4 Max With 16 inches Screen launched

Infinix INBook Y4 మాక్స్ స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్ల వివరాలు
Infinix INBook Y4 Max సన్నని బెజెల్స్‌తో చుట్టబడిన పెద్ద 16-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది FHD రిజల్యూషన్, 83 శాతం sRGB స్పేస్, 300 nits పీక్ బ్రైట్‌నెస్ మరియు 87 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంటుంది. ల్యాప్‌టాప్‌లో బ్యాక్‌లిట్ కీబోర్డ్ మరియు 7.06-అంగుళాల AG గ్లాస్ టచ్ ప్యానెల్ ఉన్నాయి.

డిజైన్ వారీగా, ఇన్ఫినిక్స్ INBook Y4 Max ఒక అల్యూమినియం అల్లాయ్ మెటల్ ఛాసిస్ మరియు మూతపై డ్యూయల్-ఫినిష్ డిజైన్‌ను కలిగి ఉంది. దీని బరువు 1.78 కిలోలు. ఆడియో ముందు భాగంలో, మెషిన్ డ్యూయల్ 2W స్పీకర్లతో అమర్చబడి ఉంటుంది.

అలాగే, Infinix INBook Y4 మాక్స్ లో 13వ తరం ఇంటెల్ కోర్ i3, i5 మరియు i7 ప్రాసెసర్‌లతో కాన్ఫిగర్ చేయవచ్చు. దీనికి ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ Iris Xe GPU గ్రాఫిక్స్ కార్డు కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ 16GB RAM మరియు 512GB SSD స్టోరేజీ తో ప్యాక్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 70Wh బ్యాటరీ సెల్‌తో మద్దతు ఇస్తుంది. ఇది విండోస్ 11 OS లో పనిచేస్తుంది.

ఇన్ఫినిక్స్ INBook Y4 మాక్స్ ని కనెక్టివిటీ ఎంపికలలో USB-A పోర్ట్, USB-C పోర్ట్‌లు, మైక్రో SD కార్డ్ స్లాట్, 3.5mm జాక్ మరియు HDMI 1.4 పోర్ట్ ఉన్నాయి. ఈ Infinix INBook Y4 Max ల్యాప్‌టాప్ యొక్క బేస్ మోడల్ కాన్ఫిగరేషన్ కోసం రూ. 37,990 ప్రారంభ ధర ను కలిగి ఉంది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా జనవరి 22 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఇంతకు ముందు, గత సంవత్సరం డిసెంబర్ లో Infinix Inbook Y2 ప్లస్ ల్యాప్‌టాప్‌ ను భారతీయ ల్యాప్‌టాప్ మార్కెట్లో తక్కువ ధరకు విడుదల చేసింది. అలాగే, గత సంవత్సరం ప్రారంభంలో కంపెనీ ప్రారంభించిన Infinix Inbook Y1 ప్లస్ మోడల్‌కు ఇది కొనసాగింపు గా వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల యాంటీ-గ్లేర్ LCD డిస్‌ప్లే ఉంది.

ఈ ఇన్ఫినిక్స్ Inbook Y2 Plus ధరల ప్రకారం, ఇంటెల్ కోర్ i3-1115G4 + 8GB RAM ధర రూ. 27,490 కాగా, ఇంటెల్ కోర్ i5-1155G7 + 16GB RAM ధర రూ. 34,990. ఈ పరికరం మూడు రంగుల ఎంపికలలో లభిస్తుంది - సిల్వర్, బ్లూ మరియు గ్రే వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Inbook Y4 Max With 16 inches Screen, 13th Gen Intel Processor Launched In India. Price And Specifications.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X