Home
Computer

15.6 అంగుళాల FHD+ డిస్‌ప్లే, Intel కోర్‌ అల్ట్రా 9 ప్రాసెసర్‌తో ల్యాప్‌టాప్‌ విడుదల.. ధర, సేల్‌ వివరాలు..!!

ఇన్ఫినిక్స్‌ జీరోబుక్‌ అల్ట్రా ల్యాప్‌టాప్‌ ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యాలను కలిగి ఉంటుందని ఇన్ఫినిక్స్‌ ( Infinix Zerobook ultra laptop launched in India) తెలిపింది. ఈ జీరోబుక్ విండోస్ 11 హోమ్‌ OS పైన పనిచేస్తుంది. మరియు 15.6 అంగుళాల పుల్‌ HD+ IPS డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌ ను ఫ్లిప్‌కార్ట్‌ ను కొనుగోలు చేయవచ్చు. మూడు వేరియంట్‌లలో ఈ ల్యాప్‌టాప్‌ అందుబాటులో ఉంది.

ఇన్ఫినిక్స్‌ జీరోబుక్‌ అల్ట్రా స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్‌ జీరోబుక్‌ అల్ట్రా ల్యాప్‌టాప్‌ 1080*1920 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 15.6 అంగుళాల పుల్‌ HD IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. 178 డిగ్రీల కోణంలో డిస్‌ప్లేను చూసేందుకు వీలుంటుంది. 400 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది.

Infinix zerobook ultra laptop

ఈ ఇన్ఫినిక్స్‌ ల్యాప్‌టాప్‌ విండోస్‌ 11 హోమ్‌ OS ను కలిగి ఉంది. Intel core అల్ట్రా 9 ప్రాసెసర్‌ సహా Intel Arc గ్రాఫిక్స్‌ తో జతచేయబడింది. మరియు 32GB LPDDR5x ర్యామ్‌ను కలిగి ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టాస్క్‌ల కోసం ఈ ప్రాసెసర్‌ Intel AI న్యూట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను కలిగి ఉంది.

ఈ ఇన్ఫినిక్స్‌ ల్యాప్‌టాప్‌ వీడియో కాల్స్‌ కోసం పుల్‌ HD వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా Mi-Pi ప్రోటోకాల్‌ సాయంతో AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) బ్యూటీక్యామ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. DTS ఆడియోతో కూడిన డ్యూయల్‌ 2W మైక్రోఫోన్‌లతో అందుబాటులోకి వచ్చింది.

Infinix zerobook ultra laptop

ఈ ఇన్ఫినిక్స్‌ జీరోబుక్‌ అల్ట్రా ల్యాప్‌టాప్‌ 100W అడాప్టర్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 70Wh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ సింగిల్ ఛార్జింగ్‌తో 1080p వీడియో ప్లేబ్యాక్‌తో 13 గంటలపాటు వినియోగించుకోవచ్చు. లేదా వెబ్‌ బ్రౌజింగ్‌ కోసం 10 గంటలపాటు వినియోగించుకోవచ్చు.

ఈ ల్యాప్‌టాప్‌ ప్రత్యేకమైన కూలింగ్‌ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చింది. ICE స్ట్రోమ్‌ 2.0 కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. మరియు రెండు USB 3.0 పోర్టులు, రెండు USB-C, SD కార్డు స్లాట్‌, HDMI 1.4 పోర్ట్‌, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5.3 మరియు వైఫై 6E ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్‌ జీరోబుక్‌ అల్ట్రా ల్యాప్‌టాప్‌ ధర :
ఇన్ఫినిక్స్‌ జీరోబుక్‌ అల్ట్రా ల్యాప్‌టాప్‌ Intel Core అల్ట్రా 5 ప్రాసెసర్ మోడల్‌ ధర రూ.59,990 గా ఉంది. అదే intel core అల్ట్రా 7 మోడల్ ధర రూ.69,990 మరియు intel core అల్ట్రా 9 ధర రూ.84,990 గా ఉంది. జులై 10 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

HDFC బ్యాంకు కార్డుల ద్వారా ఇన్ఫినిక్స్‌ జీరో బుక్‌ అల్ట్రా ల్యాప్‌ టాప్‌ ను కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు రూ.2813 నెలవారీ EMI చెల్లించి కొనుగోలు చేయవచ్చు. మరియు ఎక్స్చేంజీ ద్వారా రూ.28,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Infinix zerobook ultra laptop launched in india specifications sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X