సైగలతో శాసించేందుకు ఇంటెల్ రె‘ఢీ’..?

Posted By: Staff

సైగలతో శాసించేందుకు ఇంటెల్ రె‘ఢీ’..?

 

టెక్నాలజీ రంగంలో ఇంటెల్‌ను పైనీర్ బ్రాండ్‌గా చెప్పుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటెల్ సమకూరుస్తున్న టెక్నాలజీతో అనేక హై క్వాలిటీ గ్యాడ్జెట్‌లు వేగవంతంగా పనిచేస్తున్నాయి. ప్రాసెసర్‌ల ఉత్పత్తి రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఇంటెల్ తాజా ప్రయత్నంగా ఉన్నత శ్రేణి ల్యాప్‌టాప్‌లతో పాటు, టాబ్లెట్ కంప్యూటర్లను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంటెల్ రూపొందించిన ఈ గ్యాడ్జెట్‌లను సంజ్ఞలు (సైగలు), వాయిస్ కమాండ్‌లతో నియత్రించవచ్చు.

వినూత్నంగా ఇంటెల్ రూపొందిస్తున్న తాజా ల్యాప్‌టాప్ లేటెస్ట్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం పై రన్ కానుంది. ఈ డివైజ్‌లో టచ్‌ప్యాడ్ ప్యానల్‌ను అత్యాధునిక వ్యవస్థతో డిజైన్ చేశారు. స్వైప్స్ అదే విధంగా టచ్ ప్రక్రియ ద్వారా ఈ ల్యాపీని నిర్వహించవచ్చు. వన్నె కొల్పోతున్న అల్ట్రాబుక్ పరికరాల ఔన్నత్యాన్ని పెంచే క్రమంలో వాటి వృద్ధికి ఇంటెల్ తోడ్పడుతున్నట్లు ఇంటెల్ కంపెనీ ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు.

వాయిస్ కంట్రోల్స్ ఆధారితంగా పనిచేసే అల్ట్రాబుక్‌లను డిజైన్ చేసేందుకు నాన్సీ కమ్యూనికేషన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ ఏడాదిలోనే ఇవి మార్కెట్లోకి రానున్నట్లు సమచారం. ఈ గ్యాడ్జెట్‌లలో పొందుపరచనున్న వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ 8 భాషలను గుర్తించగలుగుతుంది. ఇంటెల్ డిజైన్ చేస్తున్నఇతర కంప్యూటింగ్ గ్యాడ్జెట్ల పూర్తి సమాచారం లాస్‌వేగాస్‌లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో‌లో వెల్లడవుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting