ఇంటెల్ ఎడ్యుకేషన్ 2 ఇన్ 1 కంప్యూటర్

Posted By:

ఇంటెల్ ఎడ్యుకేషన్ 2 ఇన్ 1 కంప్యూటర్

ప్రముఖ కంప్యూటర్ చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్ భారత విద్యార్థుల కోసం ఇంటెల్ ఎడ్యుకేషన్ 2 ఇన్ 1 పేరుతో బహుళ ఉపయోగకర కంప్యూటింగ్ డివైస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ హైబ్రీడ్ కంప్యూటింగ్ డివైస్‌ను ల్యాప్‌టాప్ అలానే ట్యాబ్లెట్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు. వివిధ వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఈ కంప్యూటింగ్ డివైస్ ప్రారంభ ధర రూ.25,000. ఈ సౌకర్యవంతమైన పోర్టబుల్  కంప్యూటింగ్ పరికరాన్ని ఇలైట్‌‍గ్రూప్ కంప్యూటర్ సిస్టమ్స్ వృద్థి చేసింది. ఈ 2 ఇన్ 1 డివైస్‌కు సంబంధించి ఫీచర్లను పరిశీలించినట్లయితే...

10 అంగుళాల స్ర్కీన్ ( 1366 x 768 రిసల్యూషన్ పిక్సల్ తో),
వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 16:9 యాక్టివ్ టచ్‌స్ర్కీన్,
5 పాయింట్ టచ్, కెపాసిటివ్ స్టైలస్,
డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్,
విండోస్ 8.1 32 బిట్ ఆపరేటింగ్ సిస్టం,
1.8గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.26 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
7600 ఎమ్ఏహెచ్ పాలిమర్ బ్యాటరీ.

డివైస్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే... బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3జీ మరియు ఎల్టీఈ, 802.11 a/b/g/n 2x2 డబ్ల్యూఎల్ఏఎన్, డబ్ల్యూఐడీఐ సపోర్ట్, యూఎస్బీ 3.0 పోర్ట, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, ఆడియో మైక్రోఫోన్ కాంబో జాక్, మైక్రోహెచ్ డిఎమ్ఐ పోర్ట్, యాక్సిలరోమీటర్ (జీ-సెన్సార్), యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, జీపీఎస్ (ఆప్షనల్), స్టీరియో స్పీకర్, డిజిటల్ మైక్రోఫోన్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot