Home
Computer

ఇంటెల్ నుంచి కొత్త ప్రాసెసర్ లు. వీటితో మీ లాప్ టాప్ లకు ఇక తిరుగుండదు.

By Maheswara

ఇంటెల్ సంస్థ అధికారికంగా తమ 11 జనరేషన్ ఇంటెల్ కోర్ సిరీస్ లాప్ టాప్ ప్రాసెసర్ లను విడుదల చేసింది.ఈ ప్రాసెసర్ లను టైగర్ లేక్ సిరీస్ పేరుతో విడుదల చేసింది. ఈ ప్రాసెసర్‌లు 10nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటాయి మరియు ఇంటెల్ "సీక్రెట్ టైగర్ సాస్" అని పిలిచే ఒక మెటల్ స్టాక్‌తో వస్తాయి. ఈ ప్రాసెసర్‌ ల లో సూపర్‌ఫిన్ టెక్నాలజీతో 10nm ప్రాసెస్‌ను ఉపయోగించి తయారు చేయబడతాయి మరియు డ్రైవ్ కరెంట్‌ను మెరుగుపరచడానికి 60-పాలీ పిచ్ ట్రాన్సిస్టర్‌ను ఉపయోగించారు.ఇప్పటికే ఉన్న ట్రాన్సిస్టర్ లను మెరుగు పర్చడానికి లీకేజ్, వాటి పనితీరు మరియు వాటి రకాలు ను మెరుగుపరిచే విధంగా కంపెనీ పనిచేస్తోంది.

Intel Launched New 11th Gen Core Processors Tiger Lake 

అందువల్ల 11 వ జనరేషన్ ఇంటెల్ కోర్ టైగర్ లేక్ ప్రాసెసర్ ఆపరేటింగ్ వోల్టేజి ని తగ్గించగలదు. కాబట్టి, ఈ 11 వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో కూడిన ల్యాప్‌టాప్ తక్కువ కరెంటు ను ఉపయోగించు కొని 10 వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ ల్యాప్‌టాప్‌కు సమానమైన పనితీరును అందిస్తుంది.

ఇంటెల్ సంస్థ ఈ ప్రాసెసర్ లలో MIM-CAP సామర్థ్యాలను నాలుగు రెట్లు పెంచింది. దీనితో ఎక్కువ గా వాడే కంప్యూటర్ CPU ల వర్క్ లోడ్ ను కూడా తట్టుకునే సామర్థ్యము పెరిగింది. అందువల్ల, మునుపటి జనరేషన్ సిపియుతో పోల్చినప్పుడు, 11 వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ అదే టిడిపితో 20 శాతం ఎక్కువ పనితీరును అందిస్తుంది.

Intel Launched New 11th Gen Core Processors Tiger Lake 

Xe గ్రాఫిక్స్ తో వస్తుంది

11 వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ యొక్క ముఖ్యమైన అంశాలలో ఒకటి ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్. ఫోటో షాప్ వాడేటప్పుడు ఇమేజ్ అప్ స్కేలింగ్ వంటి విషయాలలో, ఇంటెల్ కోర్ i7-1185G7 లోని సరికొత్త Xe గ్రాఫిక్స్ కార్డు, AMD 4800U లోని ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్‌ కార్డు ల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తుంది. అదేవిధంగా, 11 వ జెన్ టైగర్ లేక్ ప్రాసెసర్ కూడా వీడియో ప్రాసెసింగ్ లో AMD 4800U ను అధిగమిస్తుంది.

ఇక గేమింగ్ విషయానికి వస్తే, Xe గ్రాఫిక్స్ కార్డు, AMD 4800U ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మరియు Nvidia MX350 గ్రాఫిక్‌ కార్డు ల కంటే ఎక్కువ పనితీరు కనబరుస్తుంది.

ఆధునిక కనెక్టివిటీ నెట్వర్క్ లకు అనుగుణంగా ఈ 11 వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్లు PCIe 4.0, WIFI 6 మరియు Thunderbolt 4 వంటి ఫీచర్లను కూడా అందిస్తున్నాయి. ఈ ప్రాసెసర్ల తో కూడిన కొన్ని ల్యాప్‌టాప్‌లు ఒకే ఛార్జీపై 9 గంటల పనిచేసాయి. అంతే కాక ఫాస్ట్ charging కు కూడా అవకాశం ఉంది. ఇంటెల్ సంస్థ మొత్తం మీద 9 కొత్త 11 వ జనరేషన్ ఇంటెల్ కోర్ సిపియులను విడుదల చేసింది. వీటిలో ఐదు మోడళ్లకు 28W గరిష్ట TDP మరియు మిగిలిన మోడళ్లకు 15W తో విడుదల చేసింది.

Processor Name Graphics Cores / Threads Graphics (EUs) Cache Memory Operating Range Base Freq (GHz) Max Single Core Turbo (GHz, up to) Max All Core Turbo (GHz, up to) Graphics Max Freq (GHz, up to)
Intel® CoreTM i7-1185G7 Intel Iris Xe 8/4/2020 5-Apr 12MB DDR4-3200LPDDR4x-4266 12-28W 3 4.8 4.3 1.35
Intel® CoreTM i7-1165G7 Intel Iris Xe 4-Aug 96 12MB DDR4-3200LPDDR4x-4266 12-28W 2.8 4.7 4.1 1.3
Intel® CoreTM i5-1135G7 Intel Iris Xe 4-Aug 80 8MB DDR4-3200LPDDR4x-4266 12-28W 2.4 4.2 3.8 1.3
Intel® CoreTM i3-1125G4 Intel UHD Graphics 4-Aug 48 8MB DDR4-3200LPDDR4x-3733 12-28W 2 3.7 3.3 1.25
Intel® CoreTM i3-1115G4 Intel UHD Graphics 2-Apr 48 6MB DDR4-3200LPDDR4x-3733 12-28W 3 4.1 4.1 1.35
Intel® CoreTM i7-1160G7 Intel Iris Xe 8/4/2020 5-Apr 12MB LPDDR4x-4266 7-15W 1.2 4.4 3.6 1.1
Intel® CoreTM i5-1130G7 Intel Iris Xe 4-Aug 80 8MB LPDDR4x-4266 7-15W 1.1 4 3.4 1.1
Intel® CoreTM i3-1120G4 Intel UHD Graphics 4-Aug 48 8MB LPDDR4x-4266 7-15W 1.1 3.5 3 1.1
Intel® CoreTM i3-1110G4 Intel UHD Graphics 2-Apr 48 6MB LPDDR4x-4266 7-15W 1.8 3.9 3.9 1.1
Best Mobiles in India

English summary
Intel Launched Its New 11th Generation Intel Core Processors With XE Graphics. Know The Features.  
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X