సైలెంట్ కిల్లర్ ‘ఇంటెల్ అల్ట్రాబుక్’ పై 10,000 తగ్గింపా..!!

Posted By: Staff

సైలెంట్ కిల్లర్ ‘ఇంటెల్ అల్ట్రాబుక్’ పై 10,000 తగ్గింపా..!!


‘‘అంతర్జాతీయంగా ‘చిప్’ పరికరాల తయారీలో దిగ్గజ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఇంటెల్ కార్పొరేషన్ (Intel Corporation) అనూహ్యంగా తన పంథాను మార్చుకుంది. అల్ట్రాబుక్ సిరీస్ పేరిట కంప్యూటర్ అల్ట్రాబుక్ పరికరాలను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. వినియోగదారులకు మరింత చేరువకావటంతో పాటు వ్యాపారవృద్ధిలో భాగంగా ఆచితూచి వ్యవహరిస్తున్న ‘ఇంటెల్’ తమ ప్రణాళికలలో ఎప్పటి కప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంది’’

భారతీయ మార్కెట్లో రూ.55,000కు అల్ట్రాబుక్ సిరీస్ గ్యాడ్జెట్లను విక్రయించనున్నట్లు తొలిగా ప్రకటించిన ఇంటెల్, తాజాగా ధర విషయంలో స్వల్ప మార్పులు చేసి రూ.45,000లకే అల్ట్రాబుక్ కంప్యూటర్లను విక్రయించనున్నట్లు ప్రకటన వెలువరించింది.

ముందు తరాలకు ఉపయోగపడే విధంగా అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించబడిన ఈ అల్ట్రాబుక్ పరికరాలకు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుందని ‘ఇంటెల్’ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. తక్కువ బరువు కలిగి ఉండటంతో పాటు, ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ల్యాపీలను ఇంటెల్ తీర్చిదిద్దింది.

ఇంటెల్ సంస్థ ఉపాధ్యక్షుడు మూలీ ఈడెన్ ఓ ప్రకటనలో మాట్లుడుతూ తాము ప్రవేశపెట్టబోతున్న‘అత్యాధునిక అల్ట్రాబుక్ కంప్యూటర్ పరికరాలు’ ధర తక్కువ కలిగి ఉండటంతో పాటు మన్నికైన పనితీరును ప్రదర్శిస్తాయని హామి ఇచ్చారు. శక్తివంతమైన రెండు, మూడు జనరేషన్ల ప్రొసెసింగ్ వ్యవస్థలను అల్ట్రాబుక్ పరికరాల్లో అనుసంధానించినట్లు ఈడెన్ వెల్లడించారు.

ఫైనల్ ఫేజ్ లో భాగంగా 2013 నాటికి రూపుదిద్దుకునే అల్ట్రాబుక్ పరికరాల్లో అత్యంత శక్తివంతమైన హస్వెల్ ప్రొసెసింగ్ వ్యవస్థను సమకూర్చనున్నట్లు భరోసా వ్యక్తం చేశారు. తాము ఎవరికి పోటి కాదని వినియోగదారులకు టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు, అల్ట్రాబుక్స్ పరికరాల మధ్య వృత్యాసాలను చెప్పాలన్న ఉద్దేశ్యంతోనే తమ ఊహలకు కార్యరూపాన్ని అద్దినట్లు పేర్కొన్నారు.

ఇంటెల్ చిప్ ఆధారితంగా రూపుదిద్దుకున్న ‘సూపర్ స్లిమ్ అల్ట్రాబుక్ పరికరాలు’ తక్కువ విద్యుత్ ను ఖర్చు చేయటంతో పాటు నాణ్యమైన పని తీరును వినియోగదారుడికి అందిస్తాయని ఈడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot