1500 మంది ఉద్యోగులకు ఇంటెల్ ఉద్వాసన!

Posted By:

ప్రపంచపు అతిపెద్ద కంప్యూటర్ చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్.. కోస్టా రికాలోని తమ టెస్టింగ్ ఇంకా అసెంబ్లింగ్ యూనిట్‌ను మూసివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంతేకాకుండా, ఈ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 1500 మంది ఉద్యోగోలకు ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2014 ముగింపు నాటికి ప్రపంచవ్యాప్తంగా తమకున్న శ్రామిక బలంలో 5 శాతాన్ని తగ్గించుకునేందుకు ఇంటెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

1500 మంది ఉద్యోగులకు ఇంటెల్ ఉద్వాసన!

కోస్టా రికాలో ఇంటెల్ కంపెనీకి మొత్తం 2500 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో 1500 మందికి కంపెనీ ఉద్వాసన పలికింది. కాస్టా రికా శాఖలో మిగిలిన 1000 మంది ఉద్యోగులను ఫైనాన్స్, మానవ వనరులు ఇంకా ఇతర శాఖలలోఉపయోగించుకోనున్నట్లు కంపెనీ తెలపింది. 2013 ముగింపు నాటికి ఇంటెల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 107,600. యూఎస్, ఐర్లాండ్, ఇజ్రాయిల్, చైనా దేశాల్లో ఇంటెల్ కు చిప్ తయారీ కంపెనీలు ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot