మారుతున్న సమీకరణలు... అందరూ అటు వైపేనా?

Posted By: Staff

 మారుతున్న సమీకరణలు... అందరూ అటు వైపేనా?

 

ప్రస్తుత మార్కెట్లలో లభ్యమవుతున్న టాబ్లెట్ పీసీలతో పాటు స్మార్ట్ ఫోన్‌లలో అత్యధిక శాతం క్వాల్కమ్ లేదా ఎన్-విడియ్ ప్రాసెసింగ్ వ్యవస్థల పై పని చేసేవిగా ఉన్నాయి. ఈ రేస్‌లో వెనుకబడి ఉన్న ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ఈ విభాగంలో తొలి స్థానాన్ని ఆక్రమించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ప్రత్యర్ధి బ్రాండ్‌లకు చెక్ పెట్టే క్రమంలో శక్తివంతమైన ఆటమ్ మెడ్‌ఫీల్డ్ చిప్‌లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఈ క్రమంలో ఇంటెల్, దిగ్గజ కంపెనీ ఆపిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పలు సాంకేతిక కారణాలు తలెత్తటంతో ఈ వ్యవహారం నత్తనడకన సాగుతోంది. వైఫల్యాల నుంచి పాఠాల నేర్చుకన్న చందాన ఇంటెల్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే దశగా చర్యలు చేపడుతుంది. అంతర్జాతీయంగా ఇంటెల్‌కు ఉన్న బ్రాండ్ విలువను పరిగణలోకి తీసుకుని మోటరోలా, లెనోవో, లావా వంటి ప్రముఖ టాబ్లెట్ మరియు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇంటెల్ ప్రాసెసర్లను తమ గ్యాడ్జెట్‌లలో నిక్షిప్తం చేసేకునేందుకు సుముఖంగా ఉన్నాయి. మరిన్ని తయారీ కంపెనీలు ఇంటెల్‌తో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting