నేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం!!

Posted By:

నిజంగా ఇది చాలా అద్భుతం.. ఇంటర్నెట్ మనుషులు జీవితాలనే మార్చేసింది. సరిగ్గా 45 సంవత్సరాల క్రితం అక్టోబర్ 29, 1969న 22.30 నిమిషాలకు రెండు కంప్యూటర్ల మధ్య మొట్టమొదటి సారిగా ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేయటం జరిగింది.

వివరాల్లోకి వెళితే... లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (యూసీఎల్ఏ)లో విద్యార్థి ప్రోగ్రామర్‌గా ఉన్న చార్లీ క్లైన్ ARPANET ( ఆడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్‌వర్క్) ద్వారా ప్రొఫెసర్ లియోనార్డ్ క్లెయి న్రాక్ పర్యవేక్షణలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని ఎస్‌డిఎస్ సిగ్మా 7 హోస్ట్ కంప్యూటర్ నుంచి స్టాన్‌ఫర్డ్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్‌లో ఉన్న మరో ప్రోగ్రామర్‌కు చెందిన ఎస్ఆర్ఐ ఎస్‌డిఎస్ 940 హోస్ట్ కంప్యూటర్‌కు మొట్టమొదటి సారిగా ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేసారు.

రెండు కంప్యూటర్ల మధ్య ఎలక్ట్రానిక్ సందేశాన్ని పంపేందుకు ఇంటర్నెట్‌ను మొదటి సారిగా వినియోగించిన సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 29ని అంతర్జాతీయ ఇంటర్నెట్ డేగా ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగతా ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న అంతర్జాతీయ అంతర్జాల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇంటర్నెట్ పై పరిశోధనలు జరుగుతున్న రోజుల్లో ఇంటర్నెట్, ARPANETగా పిలవబడేది.

2005 నుంచి ప్రపంచ ఇంటర్నెట్ దినోత్సవాన్ని టెలీకమ్యూనికేషన్స్ ఇంకా టెక్నాలజీ చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా అభివర్ణిస్తున్నారు. ఇంటర్నెట్ గురించి పలు ఆసక్తికర వాస్తవాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం!!

నేటి ఆధునిక యువత పై ఇంటర్నెట్ త్రీవస్థాయిలో ప్రభావం చూపుతోంది. కమ్యూనికేషన్ విభాగంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటర్నెట్ మత్తులో మునిగితేలుతున్న యువత తమ తమ లక్ష్యాలను పక్కన పెట్టి కంప్యూటర్లు.. స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. గంటల కొద్ది చాటింగ్.. ఇంటర్నట్ బ్రౌజింగ్ ఇలా అదేపనిగా వెబ్ ప్రపంచంలో విహరిస్తున్నారు.

 

నేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం!!

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం మానసికంగానూ, శారీరకంగానూ మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం!!

వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..?, ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వెబ్‌‌సైట్లుండగా, వాటిలో వేటికీ లేనంత ఆదరణ పోర్న్‌ సైట్లకు ఉందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. నిత్యం రద్దీగా ఉండే సోషల్ నెట్‌వర్కింగ్

వెబ్‌సైట్‌లతో సమానంగా ఈ పోర్న్ సైట్‌లు వీక్షకులను రాబడుతున్నాయట!.

 

నేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం!!

ఇంటర్నెట్‌కు బానిసలుగా మారిన వారి కోసం చైనా ప్రత్యేక వైద్య క్యాంపులను నిర్వహింస్తోందట.

నేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం!!

ఇంటర్నెట్‌లో 40% వాటా పోర్న్ వెబ్‌సైట్‌లదే!

నేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం!!

ఇంటర్నెట్ సామ్రాజ్యంలో రోజుకు 30,000 వెబ్‌సైట్‌లు హ్యాక్ అవుతున్నాయి.

నేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం!!

ఇంటర్నెట్ యూజర్లు నిమిషానికి 204 మిలియన్‌ల ఈ-మెయిల్స్‌ను పంపుతున్నారు.

నేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం!!

రోజుకు సుమారు లక్ష కొత్త డొమైన్‌లు ఇంటర్నెట్‌లో రిజిస్టర్ అవుతున్నాయి.

నేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం!!

ఇంటర్నెట్ సామ్రాజ్యంలో రోజుకు 30,000 వెబ్‌సైట్‌లు హ్యాక్ అవుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
International Internet Day: Happy birthday, Internet!. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot