ఇంటర్నెట్ చిట్కాలు. గూగుల్ నుంచి జీమెయిల్ వరకు
సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇంటర్నెట్ అవసరాలను తీరుస్తోంది. గూగుల్ అనేక ఆన్‌లైన్ ఫీచర్ల కలబోత. గూగుల్ కల్పిస్తున్న ఫీచర్లు నెటిజనులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ‘గూగుల్ వెబ్ బ్రౌజర్ కు సంబంధించి పలు ఇంటర్నెట్ చిట్కాలను మీకు సూచిస్తున్నాం..

ఏదైనా అంశం లేదా ప్రదేశానికి సంబంధించిన ఫోటోను గూగుల్ బ్రౌజర్ శోధించదలిచినట్లయితే ముందుగా గూగుల్ హోమ్ పేజీలోకి ప్రవేశించిండి. తరువాతి చర్యగా బ్రౌజర్ పైన వరసలో కనిపించే ఫీచర్స్ ట్యాబ్‌లోని ‘ఇమేజెస్' (Images) ఆప్షన్ పై క్లిక్ చేయండి లేకుంటే http://www.google.co.in/imghp లింక్‌లోకి ప్రవేశించినట్లయితే నేరుగా గూగుల్ ఇమేజ్ పేజీలోకి పంపబడతారు. గూగుల్ ఇమేజ్ పేజీ మీ స్ర్కీన్ పై ప్రత్యక్షమైన వెంటనే మీరు వెదకదలిచిన ఫోటోకు సంబంధించిన వివరాలను గూగుల్ సెర్చ్ కాలమ్‌లో టైప్ చేయండి. మీ కోరకున్న అంశానికి సంబంధించిన ఫోటోలు స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. వాటిలో మీకు కావల్సిన ఫోటోను ఎంపిక చేసుకుని మౌస్ రైట్ క్లిక్ సాయంతో కావల్సిన ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవచ్చు.
సెర్చ్ ఇంజన్ గూగుల్ అందిస్తున్న వివిధ సర్వీసులను చూడాలంటే సాధారణంగా ఏం చేస్తాం..? ఏమంది గూగుల్ హోమ్ పేజీలోకి ప్రవేశించి పైన ఉన్న మోనూలో చూసేస్తాం. గూగుల్ అందిస్తున్న సర్వీసులను యాక్సిస్ చేసేకునందుకు ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా..?
గూగుల్ కల్పించిన తాజా సౌలభ్యతతో జీమెయిల్ నుంచి గూగుల్‌లో అందుబాటులో ఉన్న అన్ని సర్వీసులను ఒకే క్లిక్కుతో యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకు మీరు చేయవల్సిందల్లా జీమెయిల్ ప్రొఫైల్ ఫోటో పక్కనే కనిపించే యాప్స్ ఐకాన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డ్రాప్‌డౌన్ మోనూలో గూగుల్ ప్లస్, యూట్యూబ్, గూగుల్ ప్లే, న్యూస్, డ్రైవ్ వంటి సర్వీసులను జాబితాగా పొందవచ్చు. మరిన్ని సర్వీసులను పొందాలనుకుంటే అక్కడే కనిపించే ‘మోర్' ఆప్సన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications