ఎంట్రీ అదుర్స్!!

Posted By: Prashanth

ఎంట్రీ అదుర్స్!!

 

ఇంటెక్స్ టెక్నాలజీస్ భారతీయ టాబ్లెట్ పీసీల విపణిలోకి ప్రవేశించనుంది. ఐ-ట్యాబ్ పేరుతో సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌ను ఈ సంస్థ డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పని చేసే ఈ డివైజ్ ఆకట్టుకునే లక్షణాలను ఒదిగి ఉంది.

టాబ్లెట్ స్వభావం:

8 అంగుళాల స్ర్కీన్ మల్టీ టచ్ వ్యవస్థతో పనిచేస్తుంది. పీసీలో నిక్షిప్తం చేసిన ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌కు సహకరిస్తుంది. ఏర్పాటు చేసిన ఏ8 కోర్ ప్రాసెసర్ (1జిగాహెడ్జ్ సామర్ధ్యం), అదే విధంగా 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్ వ్యవస్థలు టాబ్లెట్ పనితీరును వేగవంతం చేస్తాయి. ముందు భాగంలో ఏర్పాటు చేసిన వీడియో కాలింగ్ కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు సహకరిస్తుంది.

డివైజ్ ఎక్సటర్నల్ మెమరీ 32జీబి, పొందుపరిచిన 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ వ్యవస్థలు నెట్ బ్రౌజింగ్ అదేవిధంగా డేటా షేరింగ్ అంశాలను మరింత బలోపేతం చేస్తాయి. ధర రూ.12,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot