ఇంటెక్స్ vs మైక్రోమ్యాక్స్ (హోరాహోరి)!

Posted By: Prashanth

ఇంటెక్స్ vs మైక్రోమ్యాక్స్ (హోరాహోరి)!

 

బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ కంప్యూటర్ల విభాగంలో రెండు దేశవాళీ బ్రాండ్ల మధ్య పోటీ రాజుకుంది. ఇంటెక్స్ అదేవిధంగా మైక్రోమ్యాక్స్ డిజైన్ చేసిన తక్కువ ధర ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్లు పోటీ మార్కెట్‌ను నెలకొల్పాయి. మైక్రోమ్యాక్స్ డిజైన్ చేసిన టాబ్లెట్ ‘ఫన్‌బుక్ ఆల్ఫా’కు, ఇంటెక్స్ తయారీ చేసిన ‘ఐబడ్డీ 7.2’ సవాల్‌గా నిలించింది. ఈ రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై విశ్లేషణ..

చుట్టుకొలత ఇంకా డిస్‌ప్లే:

ఫన్‌బుక్ ఆల్ఫా: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (డిస్‌ప్లే రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ఐబడ్డీ 7.2: 7.2 is 194 x 120 x 13మిల్లీమీటర్లు, 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (డిస్‌ప్లే రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్:

ఫన్‌బుక్ ఆల్ఫా: సింగ్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఐబడ్డీ 7.2 : సింగ్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం:

ఫన్‌బుక్ ఆల్ఫా: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ఐబడ్డీ 7.2: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

ఫన్‌బుక్ ఆల్ఫా: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఐబడ్డీ 7.2: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

మెమరీ:

ఫన్‌బుక్ ఆల్ఫా: 512 ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఐబడ్డీ 7.2: 512 ఎంబీ ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

ఫన్‌బుక్ ఆల్ఫా: వై-ఫై, 3జీ వయా డాంగిల్, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ 2.0 పోర్ట్,

ఐబడ్డీ 7.2: 3జీ వయా డాంగిల్, వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0పోర్ట్,

బ్యాటరీ:

ఫన్‌బుక్ ఆల్ఫా: 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ఐబడ్డీ 7.2: 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

తీర్పు:

ఇంటర్నల్ మెమరీ విషయంలో ఇంటెక్స్ ఐబడ్డీ ముందంజలో ఉంది. అలాగే డివైజ్‌లో నిక్షిప్తం చేసిన యాంగ్రీ బర్డ్స్, ఫ్రూట్ నింజా, కట్ ద రోప్ తదితర ఇన్‌బుల్ట్ అప్లికేషన్‌లు ఆకట్టుకుంటాయి. మరో మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫాలో లోడ్ చేసిన డాక్యుమెంట్ ఎడిటర్, టెక్స్ట్ ఎడిటర్ తదితర అప్లికేషన్‌లు యూజర్‌లకు మరింత ఉపయోగపడతాయి. ధర విషయంలో ఆచితూచి వ్యవహిరించే వారికి ఇంటెక్స్ ఐబడ్డీ ఉత్తమ ఎంపిక. బ్లూటూత్ కనెక్టువిటీని ఇష్టపడే వారికి ఫన్‌బుక్ ఆల్ఫా సరైన చాయిస్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot