ఇంటెక్స్ కంప్యూటర్ 7,000లకే!

Posted By: Super

 ఇంటెక్స్ కంప్యూటర్ 7,000లకే!

దేశీయ విపణిలో ఇంటెక్స్ సరికొత్త టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. పేరు ఇంటెక్స్ ‘ఐ-బడ్డీ’. సామాన్య, మధ్యతరగతి వర్గాటను టార్గెట్ చేస్తూ రూపొందించబడ్డ ఈ గ్యాడ్జెట్ ధర అంచనా రూ.7,000. సగటు యూజర్ కోరుకునే స్టాండర్డ్ క్వాలిటీ స్పెసిఫికేషన్‌లను డివైజ్‌లో పొందుపరిచారు.

ఇంటెక్స్ బడ్డీ కీలక ఫీచర్లు:

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 800x480), 9మిల్లీమీటర్ల మందం, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ 32జీబి, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ కనెక్టువిటీ, యూఎస్బీ పోర్ట్, బ్యాటరీ బ్యాకప్ 3 గంటలు, టాబ్లెట్ బరువు 316 గ్రాములు, కంఫర్టబుల్ టైపింగ్, ఆడోబ్ ఫ్లాష్. ఇంటెక్స్ రిటైల్ స్టోర్‌లలో ఈ టాబ్లెట్ లభ్యమవుతుంది. ధర అంచనా రూ.7,000 (సంవత్సరం వారంటతో).

మరో టాబ్లెట్ ఇంటెక్స్ ఐటాబ్ ఫీచర్లు:

8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 600పిక్సల్స్),

ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

3డి ప్రాసెసింగ్ యూనిట్,

640 x 480పిక్సల్ సామర్ధ్యం గల ఫ్రంట్ కెమెరా,

వీడియో రికార్డింగ్,

3జీ కనెక్టువిటీ,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

బ్రౌజర్ (ఆడోబ్ ఫ్లాష్ ప్లేయర్ 11),

నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ),

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్ర్,

5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

టాక్‌టైమ్ 5 నుంచి 6 గంటలు.

ధర అంచనా రూ.12,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot