ఇంటెక్స్ ఐ బడ్డీ.. ప్రీ ఆర్డర్ చేస్తే 2,500 గిఫ్ట్!

Posted By: Prashanth

ఇంటెక్స్ ఐ బడ్డీ.. ప్రీ ఆర్డర్ చేస్తే 2,500 గిఫ్ట్!

 

ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్స్ అదేవిధంగా టాబ్లెట్ కంప్యూటర్ల నిర్మాణ రంగంలో నిలకడగా రాణిస్తున్న సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్ , ఇంటెక్స్ ఐ బడ్డీ ( Intex I Buddy) పేరుతో సరొకత్త టాబ్లెట్ పీసీని వృద్ధి చేసింది. ఈ కంప్యూటింగ్ డివైజ్‌ను ఇన్ఫీబీమ్ డాట్ కామ్ ( Infibeam.com) వారు రూ.6,490 ధరకు ఆఫర్ చేస్తున్నారు. ఉచిత హోమ్ డెలివరీ సదుపాయంతో పాటు కొనుగోలు పై రూ.2,590 విలువ చేసే కాంప్లిమెంటరీ ఎమ్ఐడి(MID)కీబోర్డ్ కేసును ఉచితంగా అందిస్తున్నారు.

ఇంటెక్స్ ఐ బడ్డీ కీలక ఫీచర్లు:

స్లీక్ డిజైనింగ్, 9మిల్లీమీటర్ల మందం, 316 గ్రాముల బరువు,

7 అంగుళాల సమర్థవంతమైన టచ్ స్ర్కీన్(రిసల్యూషన్ 800 x 400పిక్సల్స్),

1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,

512ఎంబీ డీడీఆర్3 ర్యామ్,

మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (క్లాక్ వేగం 350 మెగాహెట్జ్),

.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు).

ఇతర స్పెసిఫికేషన్‌లు:

డివైజ్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇంటర్నల్ మెమెరీ సామర్ధ్యం 4జీబి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. పీసీలో ఏర్పాటు చేసిన శక్తివంతమైన 2350ఎమ్ఏహెచ్ బ్యాటరీ సుధీర్ఘ బ్యాకప్ నిస్తుంది. నిక్షిప్తం చేసిన మీడియా ప్లేయర్ అప్లికేషన్ దాదాపు ఆన్ని ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తుంది. యాంగ్రీ బర్డ్స్, ఫ్రూట్ నింజా తదితర 3డీ గేమ్‌లను ప్రీలోడ్ చేశారు. ఇంటెక్స్ ఐ బడ్డీ టాబ్లెట్‌లు ఆగస్టు 22 నుంచి మార్కెట్లో లభ్యం కానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot