ఆపిల్ తాజా సమాచారం..?

Posted By: Staff

ఆపిల్ తాజా సమాచారం..?

 

ఆపిల్ నుంచి రాబోతున్న కొత్త ఐప్యాడ్‌కు సంబంధించి గత ఆరు నెలలుగా అనేక రకాలైన పుకార్లు వెబ్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి. పలు సైట్‌లు ఈ డివైజ్‌కు సంబంధించి కొన్ని చిత్రాలను విడుదల చేయగా, మరి కొన్ని సైట్లు ఊహాజనిత ఫీచర్లతో చాంతాడంత లిస్ట్‌ను రూపొందించాయి. కాగా, కొత్త ఐప్యాడ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఆపిల్ వర్గాల నుంచి ఏ విధమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, 3వతరం ఫీచర్లతో ‘ఐప్యాడ్ 2S’ త్వరలోనే అందుబాటులోకి రానుందని ముఖ్య వర్గాల సమాచారం.

ఐప్యాడ్2ఎస్ ఊహాజనిత ఫీచర్లు:

* శక్తివంతమైన క్వాడ్ కోర్ ఏ6 ప్రాసెసర్,

* ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్,

* గ్లోబల్ రేడియో,

* జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ నెట్‌వర్క్ సపోర్ట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot