‘2012’లో వచ్చే ఆ సునామీ దెబ్బకు అన్ని గల్లంతేనా..?

Posted By: Super

‘2012’లో వచ్చే ఆ సునామీ దెబ్బకు అన్ని గల్లంతేనా..?

‘‘ఫ్లాష్.. ఫ్లాష్..., 2012లో యుగాంతం వస్తుందో రాదో తెలియదుగాని, ఆపిల్ ‘ఐప్యాడ్ - 3’ సునామీ మాత్రం ఖచ్చితంగా ప్రపంచ మార్కెట్‌ను అల్లకల్లోలం చేస్తుంది, ఈ సునామీ ఉధృతికి ఎన్ని బ్రాండ్లు గల్లంతవుతాయో.. వేచి చూడాలిమరీ..!! ’’

ప్రపంచంలో కొందరి చూపు ‘2012’ పైనే కేంద్రీకృతమయ్యింది.. కొత్త సంవత్సరంలోకి ఎప్పడు అడుగుపెడతామానని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అద్భుతాలాకు, సంచాలనాలకు వేదికగా నిలిచిన ‘2012’ మరో సాంకేతిక విప్లవానికి తెరలేపనుంది. ‘ఐప్యాడ్’ను సృష్టించి కంప్యూటింగ్ వ్యవస్థల్లో కీలక మార్పులకు కృషిచేసిన ‘ఆపిల్ సంస్థ’ సరికొత ‘ఐప్యాడ్ -3’ వర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆపిల్ ‘ఐ ప్యాడ్లు’, ఇప్పటికే రెండు వర్షన్లను మార్కెట్లో విడుదల చేసి వినియోగదారుల విశ్వసనీయతను చొరగున్నాయి. ‘ఐప్యాడ్ - 2’ విజయోత్సాహంతో ఆపిల్ యాజమాన్యం ‘ఐప్యాడ్ - 3’ పై కసరత్తు ప్రారంభించింది.

ప్రభంజనం సృష్టించబోతున్న‘ఐప్యాడ్ -3’ ఫీచర్లను పరిశీలిస్తే ఖచ్చితంగా అప్‌డేటడ్ వర్షన్‌తోనే మార్కెట్లో విడుదలవుతుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘ఐప్యాడ్ -3’ స్ర్కీన్ 9.7 అంగుళాల పరిమాణం కలిగి, వివిధ అత్యాధునిక అంశాలు ఇమిడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ‘ఆపిల్’ ఇప్పటికే 1.5 మిలియన్ ‘ఐప్యాడ్- 3’ సెట్లకు ఆర్డర్ చేసినట్లు అధికారికంగా ధృవీకరణకు వచ్చింది.

ఈ సరికొత్త ‘ఐప్యాడ్’లు చైనాలో రూపుదిద్దకుంటున్నాయి. అయితే ‘ఐప్యాడ్ -3’ సంబంధించి విడుదలవుతున్న ఏ చిన్న సమాచారమైనా ప్రాచుర్యాన్ని సంతరించుకుంటుంది. ‘ఈ విషయాన్ని బట్టే తెలుస్తోంది. ఈ పరికరం కోసం ఎన్ని కళ్లు వేచిచూస్తున్నాయా అని’. వ్యాపారం అంతగా లేకపోవటంతో ‘హెచ్ పీ’ టచ్ ప్యాడ్ల వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న‘ఆపిల్’ ఐప్యాడ్ -3ని 2012లో విడుదల చేసి మరో మైలు రాయిని అధిగమించేందుకు తహతహలాడుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot