స్టీవ్‌ జాబ్స్ భర్త్‌డే గిఫ్ట్ ఇదేనా..?

Posted By: Prashanth

స్టీవ్‌ జాబ్స్ భర్త్‌డే గిఫ్ట్ ఇదేనా..?

 

టెక్ ప్రపంచానికి తీరని శోకాన్ని మిగిల్చిన ఆపిల్ ఫౌండర్ దివంగత స్టీవ్ జాబ్స్ పుట్టిన రోజు వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి 14న జరిగే వేడుకులను ఘనంగా నిర్వహించేందుకు ఆపిల్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్ రారాజు భర్త్‌డే గిఫ్ట్‌గా ‘ఐప్యాడ్ 3’ని లాంఛ్ చేసే యోచనలో ఆపిల్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనుకన్న దాని ప్రకారం ఈ నెల 9న లాస్‌వేగాస్‌లో జరిగే ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో ‘ఐప్యాడ్ 3’ను ఎగ్జిబిట్ చేయ్యాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రదర్శన వాయిదా పడింది.

‘ఐప్యాడ్ 3’ విడుదల సమయం దగ్గర పడుతున్న నేపధ్యంలో అటు అభిమానులు, ఇటు మార్కెట్ వర్గాల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ఉత్కంఠను మరింత పెంచుతూ ‘ఐప్యాడ్ 3’ పై రోజుకో పుకారు పుట్టుకొస్తుంది. తాజాగా మరో గుసగుస వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తుంది. ఆపిల్ గ్యాడ్జెట్‌లకు విడిభాగాలను సమకూర్చే వారి నుంచి ఈ రూమర్ వ్యాప్తించందటంతో ఆసక్తి మరింత పెరిగింది.

అత్యాధునిక ‘IGZO’ డిస్‌ప్లే ప్యానల్‌ను ఐప్యాడ్3‌లో ఏర్పాటు చేసినట్లు ‘డిగిటైమ్స్’ సంచలన వివరాలను వెల్లడించిది. ఇప్పటి వరకు ఆపిల్ ద్వారా విడుదలైన ఐప్యాడ్, ఐప్యాడ్ 2, ఐ ఫోన్ 4, ఐఫోన్ 4Sలలో ఇన్ - ప్లెయిన్ స్విచ్చింగ్ డిస్‌ప్లే ప్యానల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. (ఇండియమ్ గాలియమ్ జింక్ ఆక్సైడ్’గా పిలవబడే IGZO డిస్‌ప్లే పిక్సల్ సాంద్రత అంగుళానికి 330 పిక్సల్స్. ఈ ఆధునిక డిస్‌ప్లే రెట్టింపైన పనితీరు కలిగి తక్కువ పవర్‌ను ఖర్చు చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot